Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉండి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ఆర్ఆర్ఆర్!!

raghurama krishnamraju

వరుణ్

, బుధవారం, 10 ఏప్రియల్ 2024 (15:54 IST)
వైకాపా సిట్టింగ్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ దఫా తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తాను పోటీ చేసే విషయంపై సరిగ్గా 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉండి అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉండి పరిధిలోని పెదఅమిరంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. తద్వారా తాను ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. పైగా త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
అయితే ఉండి అసెంబ్లీ టిక్కెట్‌ను టీడీపీ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ టిక్కెట్‌ను రఘురామ రాజుకు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు వార్తలు రావడంతో ఎమ్మెల్యే రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఉండి అసెంబ్లీ టిక్కెట్ కోసం రామరాజు, రఘురామరాజులు పోటీ పడటంతో ఈ టిక్కెట్ మాత్రం ఆర్ఆర్ఆర్‌కే కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
రామరాజుకు ఇచ్చిన టిక్కెట్‌ను రద్దు చేసి రఘురామ రాజుకు ఇవ్వబోతున్నారనే ప్రచారం స్థానిక టీడీపీ శ్రేణుల్లో జోరుగా సాగుతుంది. ఆ ధీమాతోనే రఘురామరాజు ఉండి నియోజకవర్గంలో ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు చంద్రబాబు నచ్చజెప్పి.. ఆ టికెట్‌ను రఘురామరాజుకు కేటాయిస్తారని, తద్వారా మరో సీనియర్ నేత శివరామరాజు కూడా శాంతిస్తారని, దీంతో ఉండి అభ్యర్థి గెలుపుకోసం పార్టీ శ్రేణులన్నీ కలిసి పని చేస్తాయని వారు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ మగాడైతే డైరెక్టుగా తిట్టాలి : ముద్రగడ పద్మనాభం