Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవస్థానానికి అజ్ఞాత భక్తుడి రూ.100 కోట్ల చెక్.. తీరా చూస్తే..

cheque
, శుక్రవారం, 25 ఆగస్టు 2023 (14:41 IST)
విశాఖపట్టణంలోని శ్రీ వరహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానికి ఓ భక్తుడు రూ.100 కోట్ల విరాళాన్ని ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయన  చెక్ రూపంలో హుండీలో వేశారు. ఈ చెక్కును బొడ్డేపల్లి ఫౌండేషన్ తర్వాత దాని మేనేజింగ్ పార్టనర్ బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి సంతకంచేసివుంది. అయితే, చెక్కుపై మాత్రం ఎలాంటి డేట్ లేదు. ఈ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత దేవాలయ అధికారులకు షాక్ తగలింది. 
 
సంబంధిత బ్యాంకు ఖాతాలో కేవలం 15 రూపాయలు మాత్రమే నిల్వ ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆలయ అధికారులు విస్తుపోయారు. ఈ చెక్కు కోటక్ మహీంద్రా బ్యాంకు చెందిన చెక్కు. గుర్తు తెలియని భక్తుడు ఇచ్చిన చెక్కును చూసి సంబరపడిన ఆలయ అధికారులు.. ఆ తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ చూసి నిరాశచెందారు. 
 
భార్యతో గొడవ... కౌన్సెలింగ్‌కు పిలిచిన పోలీసులు.. 
 
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరులో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింగి. కౌన్సెలింగ్‌కు పోలీసులు పిలవడంతో భయపడి టెక్కీ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ జలాశయంలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
సిద్దిపేట సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్ కుమార్(32) హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయనకు గోదావరిఖనికి చెందిన అశ్వినితో రెండు నెలల కిందట వివాహమైంది. పెళ్లయిన నెల నుంచే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. 15 రోజుల కిందట ఎవరికి చెప్పకుండా కిరణ్ కుమార్ వెళ్లిపోవడంతో నార్సింగి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. 
 
అదేసమయంలో గోదావరిఖని ఠాణాలో అశ్విని తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని బుధవారం కౌన్సెలింగ్‌కు రమ్మని పిలిచారు. మంగళవారం సాయంత్రం తన మేన బావమరిది నరేందర్‌తో కలిసి రంగనాయకసాగర్ జలాశయానికి వెళ్లారు. నరేందర్ చరవాణి తీసుకొని మాట్లాడుతా కట్టపై ఇమాంబాద్ రోడ్డు వద్ద కొంత దూరంలో వేచి ఉండాల్సిందిగా కోరాడు. 
 
నరేందర్ సుమారు 200 మీటర్ల దూరంలో నిలబడగా, కొద్ది సేపటికి కిరణ్ కుమార్ కనిపించలేదు. జలాశయంలో, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. గురువారం ఉదయం జలాశయంలో మృతదేహం తేలియాడింది. పర్యాటకుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోడీ వారసుడు ఆయనే...