Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తుఫాను తీరం దాటినప్పటికీ.. నేడు కూడా వర్షాలే.. వర్షాలు

cyclone
, బుధవారం, 6 డిశెంబరు 2023 (10:34 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మిచౌంగ్ తీవ్ర తుఫాను మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య దక్షిణ బాపట్ల సమీపంలో తీరం దాటిందని, ఆసమయంలో గంటకు 90-100 కి.మీ వేగంతో ఈదురగాలులు వీచాయని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఇది క్రమంగా బలహీనపడుతూ, తుఫాను తీరం దాటినప్పటికి బుధవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
 
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం కూడా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
 
అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి విపత్తుల సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుఫాను కదలికలు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేసామన్నారు. తుఫాను సమయంలో విపత్తుల సంస్థ యంత్రాంగం 24 గంటలు నిరంతరం పనిచేస్తూ సత్వరం స్పందించడం. ఉద్రిక్తతను స్పష్టంగా అంచనా వేయడంతో పాటు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 
 
సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామన్నారు. అతితీవ్రభారీ వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలెర్ట్ ద్వారా 4.06 కోట్ల మందికి పైగా సబ్ స్క్రైబర్లకి ఎప్పటికప్పుడు తుఫాను హెచ్చరిక సందేశాలు పంపినట్లు వివరించారు.
 
ప్రాథమిక నివేదికల ప్రకారం ప్రభావిత 7(నెల్లూరు మినహా) జిల్లాల్లోని 58 మండలాల్లో తుఫాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. 204 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసామని, 15173 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. 18073 ఆహారపు ప్యాకెట్లు, లక్షకుపైగా సురక్షిత వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 80 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మిచౌంగ్ తుఫాను అత్యవసర సహాయక చర్యల్లో 6 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు.
 
సోమవారం ఉదయం 8:30 నుండి మంగళవారం ఉదయం 8:30 గంటల వరకు నమోదైన గరిష్ట వర్షపాతం వివరాలు (మి.మీ లో) :- తిరుపతి జిల్లా కోటలో 388, నెల్లూరు జిల్లా మనుబోలులో 366, తిరుపతి జిల్లా చిల్లకూరులో 335, నాయుడుపేటలో 271, బలయపల్లిలో 239 నెల్లూరు జిల్లా సైదాపురంలో 223, వెంకటాచలంలో 213 మిమీ వర్షపాతం నమోదైంది. 
 
మంగళవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటలకు వరకు నమోదైన గరిష్ట వర్షపాతం వివరాలు (మి.మీ లో) :- ఏలూరు జిల్లా తదువైలో 148 మిమీ, బాపట్ల జిల్లా గురిజేపల్లిలో 145, అనకాపల్లి దార్లపూడిలో 136, కొత్తకోటలో 130, బలిఘట్టం 126, బాపట్ల జిల్లా అప్పికట్లలో 125, అనకాపల్లి కృష్ణాపురంలో 118 మిమీ వర్షపాతం నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్వకుంట్ల పాలనను కూలదోసిన ప్రజలకు ధన్యవాదాలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి