Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పశ్చాత్తాపమే లేదు.. ప్రజలు దిగిపొమ్మంటే దిగిపోతా.. వైఎస్ జగన్

jagan

సెల్వి

, గురువారం, 25 జనవరి 2024 (11:31 IST)
తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషనల్ సమ్మిట్‌లో వైఎస్ జగన్ ఇండియా టుడేతో సంభాషించారు  ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలను ఎందుకు మార్చారని సమ్మిట్‌లో ప్రశ్నించారు. 
 
జగన్‌కు అధికార వ్యతిరేకత అంటే భయం ఉందా, అందుకే ఎమ్మెల్యేలను మారుస్తున్నారా అని ఎదురైన ప్రశ్నలకు స్పందిస్తూ.. ఏ పార్టీ అయినా ఎమ్మెల్యేలను మార్చడం మామూలే అని జగన్ బదులిచ్చారు. ప్రతి పార్టీకి దాని స్వంత సర్వే నివేదికలు ఉన్నాయి. అదే విధంగా వైసీపీ కూడా రిపోర్టులు ఇచ్చింది. 
 
స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజల్లో మంచి గుర్తింపు లేని సందర్భాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ బాగానే ఉన్నా ఈ ఎమ్మెల్యేల పరువు మాత్రం చెడింది. అలాంటి నియోజకవర్గాల్లో మార్పుచేర్పులు చేస్తున్నాం.
 
కుల సమీకరణలు, ప్రజల అవగాహన ఆధారంగానే జగన్ ఈ మార్పులు చేశారన్నారు. తన ఐదేళ్ల పదవీకాలంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఎన్నికల్లో ప్రజా తీర్పు ఆధారంగా తాను కూడా పదవి నుంచి తప్పుకుంటానని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ప్రజలు దిగిపొమ్మంటే దిగిపోతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తుందని సీఎం జగన్ విమర్శించారు. 
 
గతంలో మా బాబాయ్ వివేకానందరెడ్డిని నాపై పోటీ దింపారన్నారు. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు నా కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. విభజించి పాలించడం కాంగ్రెస్ నైజం అన్న సీఎం జగన్... వాళ్లకు దేవుడే గుణపాఠం చెబుతాడన్నారు. 
 
ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం తీర్చుకోవడం అన్నది లేనే లేదని సీఎం జగన్ అన్నారు. అవినీతి ఆరోపణలు, ఆధారాలతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. 
 
సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలు చూస్తాయన్నారు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీకి ఉనికి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ-జనసేన కూటమికి మధ్యే పోటీ ఉంటుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణతంత్ర దినోత్సవం 2024 వేడుకలు: ఫ్రెంచ్ అధ్యక్షుడి పర్యటన