Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరైన రహదారి లేక కొడుకు మృతదేహంతో తండ్రి పది కిలోమీటర్ల నడక!!

deadbody

వరుణ్

, బుధవారం, 10 ఏప్రియల్ 2024 (08:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక గ్రామాలకు సరైన రహదారి వసతి లేదు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో మృతదేహాలను సైతం సొంత గ్రామాలకు తరలించలేని పరిస్థితి నెలకొంది. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఓ హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ తండ్రి పుట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి మృతదేహాన్ని ఎత్తుకుని ఏకంగా ఎనిమిది కిలోమీటర్ల మేరకు నడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతగిరి మండలం పరిధిలోని రొంపల్లి పంచాయతీ చినకోనెలకు చెందిన సార కొత్తయయ్ కుటుంబంతో కలిసి గూంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చిన్న కుమారుడు ఈశ్వరీరావు (3) సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేసుకున్నాడు. 
 
అయితే, అంబులెన్స్ డ్రైవర్ వారాని మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ వద్ద దించేసి వెళ్లిపోయాడు. ఇక అక్కడ నుంచి గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో మృతదేహాన్ని మోసుకుని కానినడకన వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో పరిశ్రమ-మొదటి చెల్లింపు పరిష్కారాలను ప్రారంభించిన టాటా ఏఐఏ