Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో భారీ వర్షాలు.. కృష్ణమ్మకు జలకళ.. వరదలతో ప్రజల తంటాలు

Krishna
, బుధవారం, 26 జులై 2023 (22:09 IST)
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైజాగ్ రోడ్లు చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. వాహనాలన్నీ నీట మునిగాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్‌గా పాలకులు చెప్తున్న కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం కరగ్రహారం పరిధిలోని 360 ఎకరాల లేఅవుట్ రెండు రోజుల వర్షానికే చెరువును తలపిస్తోంది. 
 
భారీ వర్షానికి విశాఖ మహానగరం అతలాకుతలమైంది. పూర్ణ మార్కెట్, స్టేడియం రోడ్డు ఇంకా నగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 
 
అలాగే భారీ వర్షాల కారణంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా దౌలేశ్వరం వద్ద గోదావరిలోకి ఇన్‌ఫ్లో 7,41,320 క్యూసెక్కులు, 10 లక్షల క్యూసెక్కులకు చేరితే మొదటి వరద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
 
భారీ వర్షాలతో హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థుల ముందు నగ్నంగా నిద్రించాడు.. ఏమయ్యాడంటే?