Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు.. పిడుగులు, వడగండ్ల వాన 17మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల భారీ వర్షాలతో 17మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు గాలివాన బీభత్సం సృష్టించాయి. అలాగే నెల్లూరు పొదలకూరు, ఉదయగిరి మండలాల్లో పిడుగులు ప

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు.. పిడుగులు, వడగండ్ల వాన 17మంది మృతి
, బుధవారం, 2 మే 2018 (09:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల భారీ వర్షాలతో 17మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు గాలివాన బీభత్సం సృష్టించాయి. అలాగే నెల్లూరు పొదలకూరు, ఉదయగిరి మండలాల్లో పిడుగులు పడటంతో.. 17మంది మృతి చెందారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఉద్ధృతంగా వీస్తున్న గాలుల ధాటికి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
 
పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు కూలి విద్యుత్‌ సరఫరా నిలిచింది. నూర్పిడికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి పోయింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే పిడుగుల దెబ్బకు ఏడుగురు ప్రాణాలు వదిలారు. చాలా చోట్ల హోర్డింగులు నేలకూలాయి. వేలాది ఎకరాల్లో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. ఎడతెరపిలేకుండా ఆదివారం ఉదయం నుంచి కురిసిన వర్షాలు తీవ్రనష్టానికి దారితీశాయి. 
 
అకాల వర్షాలను, వాటి కారణంగా కలిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం, రెంటచింతల తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకే చీకట్లు అలముకున్నాయి. గుంటూరు, విజయవాడ నగరాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకూలడంతో ట్రాఫిక్ స్తంభించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరేంద్ర మోడీ గుజరాత్‌కు మాత్రమే ప్రధాని : రాజ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు