Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేయ్.. నీయయ్య నన్నే ఆపుతావా... నేను ఐఏఎస్ కూతుర్ని... యువతి హల్‌చల్

భాగ్యనగరంలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్‌ హైదరాబాద్ సిటీ పోలీసులు చేపట్టారు. అందులో అనేక మంది అమ్మాయిలు పీకల వరకు మద్యం సేవించి పోలీసులకు చిక్కారు. అలా పోలీసులకు దొరికి ఓ అమ్మాయి.. అంతాఇంతా హడావుడి చేయలేదు.

రేయ్.. నీయయ్య నన్నే ఆపుతావా... నేను ఐఏఎస్ కూతుర్ని... యువతి హల్‌చల్
, ఆదివారం, 26 ఆగస్టు 2018 (10:43 IST)
భాగ్యనగరంలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్‌ హైదరాబాద్ సిటీ పోలీసులు చేపట్టారు. అందులో అనేక మంది అమ్మాయిలు పీకల వరకు మద్యం సేవించి పోలీసులకు చిక్కారు. అలా పోలీసులకు దొరికి ఓ అమ్మాయి.. అంతాఇంతా హడావుడి చేయలేదు. రేయ్.. నీయయ్య... నన్నే ఆపుతావా అంటూ పోలీసులనే బెదిరించింది. చివరకు ఆ యువతిని స్టేషన్‌కు తరలించి, కైపు దిగిన తర్వాత కేసు నమోదు చేసి ఇంటికి పంపించారు.
 
శనివారం రాత్రి హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌తో సహా మొత్తం ఆరు ప్రదేశాల్లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మొత్తం 123 మందిపై కేసులు నమోదు చేసి.. పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
 
శనివారం రాత్రి పట్టుబడ్డ వారిలో ఓ యువతి హల్‌చల్ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో తనిఖీలు నిర్వహిస్తుండగా పూటుగా మద్యం సేవించి కారు నడిపిన యువతిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తాను ఐఏఎస్ అధికారి కూతురిని అంటూ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగి.. తెలిసిన వాళ్లతో ఫోన్లు చేయించేందుకు ప్రయత్నించింది. 
 
బ్రీత్ అనలైజర్ పరీక్షకు కూడా ఆ యువతి అంగీకరించకలేదు. దీంతో జూబ్లీహిల్స్ మహిళా కానిస్టేబుల్స్ వచ్చి సదరు యువతిని పీఎస్‌కు తరలించారు. అక్కడ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. 148 బీఏసీ పాయింట్లు వచ్చింది. దీంతో కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. అనంతరం పోలీసులు యువతిని ఇంటికి పంపించేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడల్ 'ప్రైవేట్' భాగాలను తమలపాకు.. కుంకుమ భరణితో దాచి...