Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గల్లీ అబ్బాయి ''జొమాటో''ను ఎలా వాడుకున్నాడో తెలుసా?

గల్లీ అబ్బాయి ''జొమాటో''ను ఎలా వాడుకున్నాడో తెలుసా?
, శనివారం, 17 ఆగస్టు 2019 (17:22 IST)
అవును హైదరాబాద్ అబ్బాయి.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోను అలా వాడుకున్నాడు.. ఎలాగని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవండి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన ఓబేష్ అనే యువకుడు అర్థరాత్రి 12 గంటలకు ఓ షాపింగ్ సెంటర్‌ను ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటోలు దొరకలేదు. 
 
ఇంకా కాల్ ట్యాక్సీల్లో రెండింతల చెల్లింపు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అతనికి ఓ ఐడియా తట్టింది. ఇక తన చేతిలోని స్మార్ట్ ఫోన్ తీసి, సమీపంలోని హోటల్‌ నుంచి జొమాటో ద్వారా ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చాడు. ఆపై వచ్చిన డెలివరీ బాయ్‌తో తన ఇంటికే ఆ ఫుడ్‌ను ఆర్డర్ చేశానని... ఎలాగో ఆర్డర్ ఇంటికివ్వాలి కాబట్టి తనను కూడా ఇంట్లో డ్రాప్ చేయాల్సిందిగా అడిగాడు. 
 
ఇందుకు డెలివరీ బాయ్ కూడా ఓకే చెప్పేయడంతో ఆర్డర్‌తో పాటు ఓబేష్ కూడా సేఫ్‌గా ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఓబేష్ ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ''ఈ ఉచిత ప్రయాణానికి ధన్యవాదాలు జొమాటో'' అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. 
 
ఇందుకు జొమాటో కేర్ కూడా ట్విట్టర్లో స్పందించింది. ''ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారం అవసరం అవుతుంది'' అంటూ ఇమేజ్‌ను జత చేసింది. ఆ ఇమేజ్‌లో జీనియస్ అంటూ ఓబేష్‌కు కితాబిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఇంకా హైదరాబాద్ అబ్బాయికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లావుగా వున్నావే.. ఐస్‌క్రీమ్ తినొద్దే.. అన్నాడు.. అంతే గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే?