Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాపులు ఏ పార్టీకి కాపు కాయాలి? పవన్ లేదా కాంగ్రెస్?

కాపులు ఏ పార్టీకి మద్దుతు పలకాలి అనే అంశం పై కాపు జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి ) ఓ నిర్ణయం తీసుకోనుంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ తీరును చూస్తే కాపులు కాంగ్రెస్ పార్టీకి లేదా జనసేనలకు మద్దుతు పలికే అవకాశం ఉందా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయిత

కాపులు ఏ పార్టీకి కాపు కాయాలి?  పవన్ లేదా కాంగ్రెస్?
, శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (12:21 IST)
కాపులు ఏ పార్టీకి మద్దుతు పలకాలి అనే అంశం పై కాపు జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి ) ఓ నిర్ణయం తీసుకోనుంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ తీరును చూస్తే కాపులు కాంగ్రెస్ పార్టీకి లేదా జనసేనలకు మద్దుతు పలికే అవకాశం ఉందా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయితే  పదమూడు జిల్లాల కాపు జెఎసిలు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడుతానని ముద్రగడ చెపుతున్నారు. 
 
తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్‌ను ముద్రగడ కలిసిన సందర్భంతో ఈ విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కాపు పెద్దలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కాపుల రిజర్వేషన్ పైన హామీ ఇచ్చినా, కేంద్రం పరిధిలో ఉందని చేతులు ఎత్తేసిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా కేంద్రం చేతిలో ఉందని చెబుతుండటాన్ని కాపు నేతలు చర్చించినట్టు సమాచారం.
 
కాంగ్రెస్‌ పార్టీ కాపు రిజర్వేషన్ల అంశానికి మద్దతు తెలుపుతానంటున్ననేపథ్యం, 9వ షెడ్యూలులో కాపు రిజర్వేషన్ల బిల్లు పెట్టేలా కృషి చేసి బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు న్యాయం చేసేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇవ్వడం... ఈ నేపథ్యంలో జెఎసి నేతలు అభిప్రాయాలు చెబితే ఆ ప్రకారం వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించవచ్చని ముద్రగడ అన్నట్టు కాపు నేతలు తెలియజేస్తున్నారు. మరి కాపులు ఏ పార్టీకి కాపు కాస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతికి మకాం మార్చనున్న జగన్.. ఇల్లు, పార్టీ కార్యాలయం ఎక్కడంటే?