Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య..

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మూడు రోజులుగా భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిపుర, మణిపూర్, మి

దేశాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య..
, శుక్రవారం, 15 జూన్ 2018 (09:02 IST)
దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మూడు రోజులుగా భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిపుర, మణిపూర్, మిజోరం వంటి రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి.


వివరాల్లోకి వెళితే..  కేరళలోని కోజికోడ్ జిల్లా తమరస్సెరి తాలూకా కట్టిపారలో కొండ చరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. దీంతో కేరళలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 27కి పెరిగింది. 
 
అలాగే ఉత్తరప్రదేశ్‌లో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 15మంది మృతి చెందారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మరో నలుగురు మృతి చెందారు. ఇక వరదల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వెంటనే మరిన్ని బలగాలను, ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను.. ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కేంద్రాన్ని కోరారు. 
 
మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మణిపూర్‌లోనూ ఇటువంటి పరిస్థితే ఉండడంతో రాజధాని ఇంఫాల్ సహా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 27శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో 12 నుంచి 31 శాతానికి వర్షపాతం నమోదైందని వారు తెలిపారు. 
 
అలాగే వచ్చే 24 గంటల్లో ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిమ్, హిమాలయాస్, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యా కుమార్తెపై 20 మంది గ్యాంగ్ రేప్..