Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి రోజాకు చుక్కలు చూపిస్తున్న జడ్పీటీసీ సభ్యుడు.. ఎలా?

rk roja

వరుణ్

, సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (10:35 IST)
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఏపీ మంత్రి ఆర్కే రోజాకు స్థానిక నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో మంత్రి రోజాను స్థానిక నేతలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. పైగా, రోజాకు వ్యతిరేకంగా గళం విప్పే నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. తాజాగా తన నియోజకవర్గంలో జరిగిన ఓ సంఘటనపై మంత్రి రోజా అవాక్కయ్యారు. వడమాల పేట మండలం, అప్పలాయిగుంటలో సచివాలయం, పుత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్రం, జగనన్న పాల సేకరణ కేంద్రాలను మంత్రి రోజా చేతుల మీదుగా త్వరలో ప్రారంభంకావాల్సివుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆదివారం ఈ మూడు కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేశారు. గతంలో పత్తిపుత్తూరులో సచివాలయం భవనం ప్రారంభానికి మంత్రి రోజా ఏర్పాట్లు చేసుకోగా, తనకు బిల్లులు ఇవ్వనిదే ప్రారంభం చేయకూడదంటూ మురళీధర్ రెడ్డి భవనానికి తాళం వేశారు. మురళీధర్ ఇస్తున్న షాకులకు మంత్రి రోజా తలబొప్పికట్టిపోతుంది. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయలేక పోవడమే కాకుండా, చర్యలు కూడూ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 
 
అలాగే, ఇటీవల జరిగిన జడ్పీటీసీ సమావేశంలోనూ జడ్పీటీసీ సభ్యులు రోజాకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. పైగా, ఆమెకు టిక్కెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు. మరుళీధర్ రెడ్డితో పాటు పుత్తూరుకు చెందిన వైకాపా బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి ఏలుమలై, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి, నగరి పురపాలిక మాజీ చైర్మన్ కేజే కుమార్, నిండ్రకు చెందిన శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజు తదితరుల కొన్ని రోజులుగా మంత్రి రోజా దూరం పెట్టారు. దీంతో వారంతా ఏకమై ఆమెకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ప్రారంభం