Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా బిడ్డల్లాంటి వారిపై లాఠీఛార్జీనా? భోజనం చేసేందుకు టేబుల్ కూడా?

Nara Bhuvaneshwari
, సోమవారం, 25 సెప్టెంబరు 2023 (21:21 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మహిళలు అన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని చెప్పారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
పోలీసులు ఏం చేసినా తమ బిడ్డలు బెదరరని, టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు భువనేశ్వరి.   
 
చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి ఉద్ఘాటించారు. 
తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదన్నారు. చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేష్ చతుర్థి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. 15 ఏళ్ల బాలికపై..?