Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నేరమా.. రూ.వేల కోట్లు దోచుకోవడం నేరమా? నారా బ్రహ్మణి

nara brahmani
, ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (11:19 IST)
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నేరమా అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణి ప్రశ్నించారు. ఏది నేరం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నేరమా అని నిలదీశారు. ఇది నేరమైతే.. వేలాది కోట్ల రూపాయలతో పాటు రాష్ట్ర వనరులను దోచుకున్న వారిని ఏమనాలని ఆమె ప్రశ్నించారు. 
 
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శనివారం రాత్రి రాజమండ్రిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో చంద్రబాబు భార్యత పాటు నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, 'ఏది నేరం! రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నేరమా? స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం నేరమా? నీతిగా నిజాయితీగా పాలన సాగించడం నేరమా! చంద్రబాబు చేసిన నేరం ఏంటి?' అని ఆమె ప్రశ్నించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఎలాంటి ఆధారాలూ లేని కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేసిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు ఐటీని తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని, నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లక్షలాదిమంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేశారని, ఇవి చేయడం నేరమా? అని ప్రశ్నించారు. 
 
రేపు లోక్‌శ్‌ను అరెస్టు చేసినా చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. 'ఏరోజూ మా అత్త భువనేశ్వరి బయటకు రాలేదు. ఈరోజు వచ్చారు. ఎంతోమంది. మహిళలు మాకు మద్దతుగా బయటకు వచ్చారు. నా భర్త ఒక చోట, నేను ఒకచోట, మా కుమారుడు మరో చోట ఉన్నామనే బాధ ఉన్నా రాష్ట్ర ప్రజలంతా మా కుటుంబ సభ్యులేననే ధైర్యం ఉంది' అని బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రెజిల్‌లో కూలిన విమానం... 14 మంది మృత్యువాత