Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌కు ఖైదీలంటే అమితమైన ఇష్టం.. అందుకే వారికి నెలకు రూ.2 వేలు భత్యం : నారా లోకేష్

Nara Lokesh speech

వరుణ్

, సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (14:15 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖైదీలంటే అమితమైన ఇష్టమని అందుకే వారికి నెలకు రూ.2 వేల చొప్పున భత్యం అందజేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో ఆదివారం జరిగిన శంఖారావంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, గూగుల్‌లో 6093 అని కొడితే ఖైదీ జగన్ ఫొటో వస్తోంది. 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్నాడు. ఖైదీలంటే జగన్‌కు ఇష్టం... అందుకే జైల్లో ఖైదీలకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నాడు. కానీ స్కూలు పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదు. హాస్టళ్లలో పాచిపోయిన భోజనం పెడుతున్నారు. టాయిలెట్లు కూడా సరిగా లేవు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతాం. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో మోసం చేస్తున్నాడు.. వీటిని రద్దు చేసి గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తీసుకొస్తాం అని ప్రకటించారు. 
 
పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర అని కీర్తించారు. టీడీపీ హయాంలో నెలకో పరిశ్రమ విశాఖకు వచ్చేదని, తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒక ఐటీ కంపెనీని ప్రారంభించేవాడ్నని గుర్తు చేసుకున్నారు. ఇవాళ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నాను. దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ అమ్మ అడిగింది... మీరు ఎప్పుడు విశాఖ వచ్చినా అప్పన్నను దర్శించుకుంటారు... జగన్ ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోడు ఎందుకు అని?... ఆ తల్లికి చెప్పా... రేపు సీఎం వస్తున్నారంట.. ఆయన్నే అడగాలని. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడకి మాత్రమే జగన్ వెళతాడని ఓ కుర్రాడు చెప్పాడు.
 
జగన్ జలగ లాంటివాడు. సైలెంట్‌గా పోర్టులు కొట్టేస్తున్నాడు. కృష్ణపట్నం పోర్టు కొట్టేసి 10 వేల మంది కార్మికుల పొట్టగొట్టాడు. టీడీపీ నేతలు పోరాడితే కేరళలో కంటైనర్ షిప్‌కు బెర్త్ దొరక్కపోతే ఆ కంటైనర్ షిప్ తెచ్చి కృష్ణపట్నంలో పెట్టి మరమ్మతులు చేస్తున్నామని నాటకమాడుతున్నారు. నెల్లూరులో కోర్టు దొంగ ఉన్నాడు... ఆయన పేరు కాకాణి గోవర్ధన్ రెడ్డి. కంటైనర్ వచ్చేటప్పుడు అర్థరాత్రి వీడియోలు తీసి చూడండి అని డ్రామాలు ఆడుతున్నాడు. ఈ ప్రభుత్వం అద్భుతమైన నాటకాలకు ఇదొక ఉదాహరణ.
 
విశాఖ సౌత్ నియోజకవర్గం మతసామరస్యానికి మారుపేరు వంటిదని అన్నారు. ఒకే కొండపై ఆలయం, మసీదు, చర్చి ఉంటాయని వెల్లడించారు. గతంలో మేమొక పొరపాటు చేశాం. మీరందరూ వద్దన్నా మీకు ఒక వ్యక్తిని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం. మీరు ఆ వ్యక్తిని గెలిపించారు. కానీ అలాంటి వ్యక్తిని మీకివ్వడం మేం చేసిన పొరపాటు. అందుకే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించండి. అలాంటి వ్యక్తులకు ఇకమీదట టీడీపీలో నో ఎంట్రీ. ఇక రుషికొండకు గుండు కొట్టారు. అక్కడ ఒక్క వ్యక్తి కోసం రూ.500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారు. గత రాత్రి వెళ్లి ఆ ప్యాలెస్ చూశాను. ఒక్క వ్యక్తికి అంత పెద్ద ప్యాలెస్ ఎందుకో అర్థం కాలేదు. అందులోని బెడ్ రూమే చంద్రబాబు ఇల్లంత ఉంది. మేం అధికారంలోకి వచ్చాక ఆ ప్యాలెస్‌ను ప్రజల పరం చేస్తామన్నారు. 
 
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా యూనివర్సిటీని ఎంతో అభివృద్ధి చేశారు. ఆ సమయంలో ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోనే 29వ స్థానంలో ఉండేది. అలాంటిది, ఈ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక యూనివర్సిటీలో ప్రసాదరెడ్డి అనే ఒక వెధవను వైస్ చాన్సలర్ గా కూర్చోబెట్టారు. ఆ వెధవ వీసీ అయ్యాక వర్సిటీ 29వ స్థానం నుంచి 76వ స్థానానికి పడిపోయింది. విశాఖకు ఉన్న మంచి విద్యా సంస్థ ఆంధ్రా యూనివర్సిటీ. అలాంటి విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి నాశనం చేస్తున్నాడు అంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ కొత్త ప్లాన్స్