Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో బీజేపీకి మద్దతుగా నారా లోకేష్ ప్రచారం...

nara lokesh

వరుణ్

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (11:36 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా, ఆయన తమిళనాడు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.అన్నామలైకు అనుకూలంగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, గురువారం రాత్రి ఏడు గంటలకు పీలమేడులో నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. అలాగే, శుక్రవారం కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రచారం చేయనున్నారు. 
 
రెండు రోజుల పాటు చేపట్టే నారా లోకేష్ ప్రచారంలో సభలు, రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం సింగానల్లూరులోని ఇందిరా గార్డెన్స్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. కాగా, కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అక్కడ తెలుగువారు అధికంగా ఉండడంతో వారిని బీజేపీ వైపు తిప్పుకునేందుకు లోకేశ్‌తో ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించింది.

వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు!! 
 
వేసవి రద్దీని నివారించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను నడుపనుంది. ఈ రైళ్లు ఈ నెల 19వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను పరిశీలిస్తే, బెంగాల్ లోని షాలిమార్, సాంత్రాగచ్చిలకు, కేరళలోని కొల్లంకు ఈ రైలు సర్వీసులను నడుపనుంది. 
 
సికింద్రాబాద్ - సాంత్రాగచ్చి (07223) రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకూ 11 ట్రిప్పులకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ప్రతి శనివారం తిరుగుప్రయాణమయ్యే సాంత్రాగచ్చి - సికింద్రాబాద్ (072274) రైలుకు సంబంధించి ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకూ 11 ట్రిప్పులు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లలో ఈ రైళ్లు ఆగుతాయి. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
 
అలాగే, సికింద్రాబాద్ - షాలీమార్ (07225) ప్రత్యేక రైలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం.. షాలీమార్ - సికింద్రాబాద్ (07226) రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకూ ప్రతి మంగళవారం బయల్దేరతాయి. ఒక్కో రైలును మొత్తం 11 ట్రిప్పుల మేర నడపనున్నారు. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేవ్వర్, ఖరగ్పూర్, సాంత్రాగాఛి మీదుగా ప్రయాణిస్తాయి.
 
సికింద్రాబాద్ - కొల్లం మధ్య రానుపోను 22 ట్రిప్పులను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ - కొల్లం (07193) ప్రత్యేక రైలు ఏప్రిల్ 17, 24 మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 18, 19, 26 తేదీల్లో బయల్దేరుతుంది. తిరుగుప్రయాణంలో కొల్లం - సికింద్రాబాద్ (07194) రైలు ఏప్రిల్ 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో బయల్దేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధం.. పవన్ కల్యాణ్‌ను సీఎం చేసేందుకు.. కలిసి సాధిద్ధాం.. అంబటి రాయుడు