Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమాజానికి సాధికారత: గిరిజన గ్రామ ప్రజలకి సేవ చేసిన వారకి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ సన్మానం

image
, గురువారం, 16 నవంబరు 2023 (23:07 IST)
టీవీఎస్ మోటర్ కంపెనీ, సుందరం-క్లేటన్ లిమిటెడ్ యొక్క సామాజిక విభాగం, శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్, సమగ్ర గ్రామాభివృద్ధిలో భాగంగా రెండు పైపు కల్వర్టులను నిర్మించటంతో పాటుగా రివర్స్ ఆస్మాసిస్ (RO) ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, వెంకట గిరి మండలం, జువిమణి ఖండ్రిగ గిరిజన గ్రామంలోని పేద ప్రజల కోసం కమ్యూనిటీ, స్థానిక ప్రభుత్వం నుండి క్రియాశీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసింది. 
 
ఈ మౌలిక సదుపాయాలను శ్రీ. ఎం కిరణ్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి, గూడూరు మరియు శ్రీ. సూర్యనారాయణ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గూడూరు ప్రారంభించారు. రెండు పైప్ కల్వర్ట్‌లతో కూడిన ఈ మౌలిక సదుపాయాలు వర్షాకాలంలో ప్రజలు బయటి ప్రపంచం నుండి ప్రాథమిక అవసరాలను పొందేందుకు వీలుగా అవసరమైన మార్గాలుగా పనిచేస్తాయి. అదనంగా, రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ స్వచ్ఛమైన మరియు సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా కమ్యూనిటీ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది, మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. మరో గిరిజన గ్రామమైన నీలకొండాపురంలో నీటి సరఫరా చర్యలపై కూడా ఎస్‌ఎస్‌టి పని చేస్తోంది.  ఈ రెండు గ్రామాల ప్రజలకు సుమారు రూ.17 లక్షలు మొత్తం పెట్టుబడితో ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. 
 
దీనిని అనుసరించి, వెంకటగిరి మండలంలో సమాజానికి విశేషమైన అంకితభావం, అభిరుచి, కరుణతో సేవలందిస్తున్న 12 మంది ప్రభుత్వ అధికారులను సన్మానించడానికి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం మరియు సమాజ భాగస్వామ్యంతో రానున్న సంవత్సరాల్లో 10 గిరిజన కుగ్రామాలలో సమగ్ర అభివృద్ధిని సాధించే లక్ష్యంతో SST పరివర్తన యాత్రను ప్రారంభించింది. గత 12 సంవత్సరాలలో, వెంకటగిరి మండలంలోని 70 కి పైగా గ్రామాలతో మహిళా సాధికారత, నీటి సంరక్షణ, మెరుగైన వ్యవసాయం మరియు లైవ్ స్టాక్ ప్రాక్టీసెస్  ద్వారా కుటుంబాల ఆదాయాన్ని మెరుగుపరచడం మరియు కొత్త సూక్ష్మ పరిశ్రమలకు అవకాశాలు కల్పించటం  మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలలో SST పని చేస్తోంది.  కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం గత 12 ఏళ్లలో 3 కోట్లు రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి SST  పెట్టింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కమ్యూనిటీ మరియు స్థానిక ప్రభుత్వం యొక్క భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం వల్ల ప్రతి కార్యకలాపం వినూత్నంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక ఆఫర్‌తో పురుషుల దినోత్సవాన్ని వేడుక చేస్తున్న వండర్‌లా హాలిడేస్