Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయండి.. సుప్రీంలో పిటిషన్ - శుక్రవారం విచారణ

jagan
, బుధవారం, 22 నవంబరు 2023 (16:44 IST)
అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అపెక్స్ కోర్టు శుక్రవారం విచారణ జరుపుతుంది. విచారణనను త్వరగా పూర్తి చేసేలా సీబీఐని, సీబీఐ కోర్టును ఆదేశించాలని తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. 
 
అక్రమాస్తుల కేసులో రెగ్యులర్ బెయిల్‌ పొందిన సీఎం జగన్.. పదేళ్లుగా బెయిల్‌పై బయట ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచాణకు స్వీకరించింది. సీబీఐ, జగన్‌తో పాటు ప్రతిపాదులు అందరికీ నోటీసులు జారీచేసింది. మరోవైవు, రఘురామ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు విచారణ జరపనుంది. జస్టిస్ అభయ్‌ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించనుంది. 
 
కన్నకొడుకల గొంతు కోసిన తండ్రి.. ఆపై ఆత్మహత్యాయత్నం  
 
కన్నతండ్రే తన ఇద్దరు మైనర్ కుమారుల గొంతు కోసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ కుమారుల్లో రెండేళ్ల వాడు ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ళ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని వజీర్ ‌పూర్ ప్రాంతంలో ఇద్దరు మైనర్ కుమారుల గొంతుకోసి హతమార్చాలని ఒక తండ్రి ప్రయత్నించాడు. ఆ తర్వాత అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. 
 
ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో ఉన్న భరత్ నగర్ సమీపంలోని జేజే కాలనీ ఉంటుంది. అందులో ఇన్వర్టర్ మెకానిక్‌గా పని చేసే 36 యేళ్ల నిందితుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ గొడవలతో క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకుల గొంతు కోసం చంపేయడానికి ప్రయత్నంచాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకున్నాడు. 
 
ఆ సమయంలో అతడి భార్య ఇంట్లో లేదు. ఈ ఘటనలో రెండేళ్ల వయస్సున్న చిన్న కొడుకు ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ల వయస్సున్న పెద్ద కుమారుడు దారుణానికి పాల్పడిన కన్నతండ్రి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆస్పత్రి తరలించారు. కుటుంబ గొడవలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారింది.. కేసీఆరే కారణం..?