Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శేషాలచలం అడపుల్లో ఉండేది పరదాల మధ్య తిరిగే పులకేసి కాదు : తెదేపా సెటైర్

hand stick
, గురువారం, 17 ఆగస్టు 2023 (21:58 IST)
తిరుపతి శేషాచలం అడవుల్లో ఉండేది పరదాల మధ్య తిరిగే పులకేశి కాదంటూ తెలుగుదేశం పార్టీ సెటైర్లు వేసింది. తిరుపతి - అలిపిరి మెట్ల మార్గంలో నడిచే వెళ్లే శ్రీవారి భక్తులపై చిరుతపులి దాడి చేస్తే, ఆ దాడి నుంచి భక్తులు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేతి కర్రలను భక్తులకు ఇస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెదేపా నేతలు సెటైర్లు వేస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఉండేది పరదాల మాటున తిరిగే పులకేసి (సీఎం జగన్) కాదని, అది చిరుతపులి అని గుర్తుచేశారు.
 
కాగా, అలిపిరి నడకమార్గంలో ఇటీవల లక్షిత అనే చిన్నారిని చిరుతపులి బలిగొన్న విషయం తెల్సిందే. ఈ ఘటన తర్వాత కాలినడకన కొండపైకి వచ్చే భక్తుల రక్షణ కోసం చేతి కర్రలు ఇవ్వాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయంతో తితిదేపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇపుడు తెలుగుదేశం పార్టీ కూడా వ్యంగ్యంగా స్పందించింది. 
 
కర్రలు రెడీ.. ఇక పులి రావడమే తరువాయి అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేసింది. "అక్కడ ఉన్నది పరదాల మధ్య ఉండే పులకేసి అయితే కర్రలకు భయపడతాడు. కానీ, అక్కడ ఉండేది మనుషులను తినేస్తున్న ఒరిజినల్ పులి. వీళ్లని నమ్మడం కంటే గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం" అని టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బర్గర్లలో టమోటాలుండవ్.. "బర్గర్ కింగ్'' ప్రకటన