Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్హత కల్గిన వారందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం: ఉపముఖ్య మంత్రి

అర్హత కల్గిన వారందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం: ఉపముఖ్య మంత్రి
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:09 IST)
నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "పేదలకు ఇంటి పట్టాల పంపిణీ" దేశ చరిత్రలోనే మహత్తరమైన శుభకార్యం అని, ఇళ్లు లేని ఒక్క నిరుపేద మన జిల్లాలో ఉండకూడదని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు.
 
కడప నగరపాలక సంస్థ పరిధిలోని  నానాపల్లిలోని 110 ఎకరాల లే అవుట్ లో 2700 మందికి పైగా పేదలకు ఇంటిపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి.. రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప మాజీ మేయర్, కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి సురేష్ బాబులు ప్రారంభోత్సవం చేశారు. 
 
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ... పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం "పేదలకు ఇంటి పట్టాల పంపిణీ" కార్యక్రమాన్ని అత్యంత ప్రధాన్యతతో చేపట్టారన్నారు.

రాష్ట్రంలో "వైఎస్సార్‌ జగనన్న కాలనీ" లు ఏర్పాటు చేసి.. భారత దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 31 లక్షల మందికి నివాస స్థల పట్టాలు లబ్దిదారులకు అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శనీయం అన్నారు. ఆ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కలలుకన్న రామరాజ్యాన్ని ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి నూటికి నూరు శాతం నెరవేరుస్తున్నారన్నారు.
 
జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల మందికి పైగా లబ్దిదారులకు సొంతింటి కలను సాకారం చేస్తూ.. ఒక్క కడప నగరంలోనే 23500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి  వీరందరికీ ఇళ్లు నిర్మించి వచ్చే సంక్రాంతి పండగ లోపు గృహ ప్రవేశాలు  చేయిస్తామని తెలిపారు.

లే అవుట్ లలో మౌలిక సదుపాయలైన రోడ్లు, మంచినీరు మరియు విద్యుదీకరణ కల్పిస్తామన్నారు.పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం జిల్లాలో అవసరమయిన 500 ఎకరాల భూమిని కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 
 
కడప మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 23 వేలమంది లబ్దిదారులను "నవరత్నాలు"లో భాగంగా - "పేదలందరికీ ఇంటి పట్టాలు" పథకానికి అర్హులుగా ఎంపిక చేసి పట్టాల పంపిణీ కూడా దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు.

వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో కేవలం ఇంటి వరకే పరిమితం కాకుండా.. సామాజిక అవసరాలకు కూడా కొన్ని ఎకరాల స్థలాన్ని వదిలేసి ప్లాట్లను పచ్చటి మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 

పాఠశాలలు, సచివాలయాలు,అంగన్వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, రైతు భరోసా కేంద్రాలు, పార్కులు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లీనిక్‌లు, క్రీడా ప్రాంగణాలు లాంటి సామాజిక అవసరాల కోసం స్థలాలను వదిలేసి చక్కగా రహదారులు ఏర్పాటు చేశామన్నారు.
 
లబ్ధిదారుల ఎంపికలో.. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రాతిపదికగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతోందన్నారు.

లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లెవరివైనా పొరపాటున మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో వారికి ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు.దీన్ని నిరంతర ప్రక్రియగా  కొనసాగిస్తామన్నారు.
 
కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని.. పేదలకు నివాస స్థలాల పట్టాలుగా పంపిణీ చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన 18 నెలల్లోనే 100% హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

మహిళా సాధికారిత తోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని సంక్షేమ పథకాల ఫలాలను మహిళల చేతికే అందివ్వడం జరుగుతోందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గల్ఫ్ దేశాల్లో వైద్యం,నిత్యావసరాలు మినహా అన్ని బంద్