Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పులివెందులలో జగన్ తరపున చిన్నాన్న నామినేషన్ దాఖలు!

Jagan

వరుణ్

, సోమవారం, 22 ఏప్రియల్ 2024 (15:55 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరపున జగన్ చిన్నాన్న, పులివెందుల వైస్ చైర్మన్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నెల 25వ తేదీన సీఎం జగన్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తారని చిన్నాన్న మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత అనంతపురంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. 
 
సోమవారం జగన్ తరపున పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇదే అంశంపై వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్టు చెప్పరు. ఈ నెల 25వ తేదీన సీఎం జగన్ స్వయంగా మరో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని, ఆ తర్వాత భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన వెల్లడించారు.  
 
బస్సు యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ ... ఎందుకో తెలుసా?
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన బస్సు యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈ నెల 26న తేదీన వైకాపా మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉండటంతో ఈ మేనిఫెస్టో రూపకల్పన అంశంపై దృష్టిసారించేందుకు వీలుగా ఈ బస్సు యాత్రను వాయిదావేశారు. అలాగే, మంగళవారం తన పార్టీకి చెందిన సోషల్ మీడియా వింగ్‌తో జగన్ సమావేశంకానున్నారు. 
 
ఇదిలావుంటే, సోమవారం ఉత్తరాంధ్రకు సంబంధిచి ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకర్షించడం తదితర అంశాపై వ్యూహరచన చేయనున్నారు. 
 
మరోవైపు, ఈ నెల 26వ తేదీన వైకాపా మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి ధీటుగా వైకాపా నేతలు మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. 
 
మంగళవారం వైకాపా సోషల్ మీడియా వింగ్‌తో జగన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. సోషల్ మీడియా వింగ్‌తో సమావేశం త ర్వాత బస్సు యాత్రను మళ్లీ ప్రారంభమవుతుంది. మంగళవారం విజయనగరం జిల్లా బస్సు యాత్ర కొనసాగుతుంది. రోడ్ షో, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బస్సు యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ ... ఎందుకో తెలుసా?