Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-01-2024 సోమవారం దినఫలాలు - దేవి ఖడ్గమాల చదివిన లేక విన్నా శుభం...

Shukra Vakri 2023

రామన్

, సోమవారం, 8 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర ఐ|| ద్వాదశి రా.9.10 అనురాధ రా.7.52 రా.వ.1.29 ల 3.05, ప.దు. 12.24 ల 1.08 పు. దు. 2.36 ల 3.20.
 
దేవి ఖడ్గమాల చదివిన లేక విన్నా శుభం కలుగుతుంది.
 
మేషం :– హోటల్, తినుబండారు వ్యాపారులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు.
 
వృషభం :- కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు చికాకు కలిగిస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. బంధువులతో తగాదాలు ఒత్తిడిలు తప్పవు. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా సాగుతాయి.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మాట పడవలసివస్తుంది. పన్నులు, వడ్డీలు, పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి. కొత్త ఉద్యోగాల అన్వేషణ ఫలిస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశలు దక్కుతాయి. పూలు, పండ్లు, కొబ్బరి, చిరువ్యాపారులకు లాభదాయకం.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. కళల పట్ల ఆశక్తి పెరుగుతుంది. కొత్త ఉద్యోగాల అన్వేషణ ఫలిస్తుంది.
 
సింహం :- ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి అగ్రిమెంటులు వాయిదా వేసుకోవలసివస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. చేపట్టిన పనిలో కొంత అవాంతరాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో వృత్తులో ఉన్న స్త్రీలు భాగస్వామిని వదలి దూరప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.
 
కన్య :- జీవితభాగస్వామితో విభేదాలు నెలకొంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. శత్రువులు సైతం ఆకట్టుకుని ముందుకు సాగుతారు. విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలించవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. దూరదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
తుల :- ప్రముఖులను కలుసుకొని బహుమతులు అందజేస్తారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. కుటుంబసభ్యుల సలహాతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం చేతికి అందడంతో ఋణం తీర్చాలనే మీ ప్రయత్నం నెరవేరగలదు. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. క్రయ, విక్రయాలు సామాన్యంగాఉంటాయి.
 
ధనస్సు :- దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గోంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. ఉద్యోగస్థులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి.
 
మకరం :- ఇచ్చిపుచ్చుకొను వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. కుటుంబ విషయంలో కూడామీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటారు. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు కాగలదు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పున ప్రారంభమవుతాయి.
 
కుంభం :- బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విలువైన వస్తువులు కొనుగోళ్ళ నిమిత్తం ధనం బాగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- కూరగాయలు, పండ్లు, పూలు, వ్యాపారులకు పురోభివృద్ధి. రుణాలు తీర్చడానికి చేయుయత్నాలు అనుకూలిస్తాయి. వాహనం నడపునపుడు మెలకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ పుణ్య కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-01-2024 ఆదివారం దినఫలాలు-సూర్యస్తుతి ఆరాధించిన శుభం