Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-02-2024 గురువారం దినఫలాలు - కుబేరుడిని ఆరాధించిన మీ సంకల్పం సిద్ధించి...

sukra graha

రామన్

, గురువారం, 15 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ షష్ఠి సా.4.18 అశ్వని ప.3.20 ఉ.వ.11.31 ల 1.03 రా.వ.12.32 ల 2.04. ఉ. దు. 10.20 ల 11.06 ప.దు. 2.51 ల 3.36.
కుబేరుడిని ఆరాధించిన మీ సంకల్పం సిద్ధించి శుభం కలుగుతుంది.
 
మేషం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు.
 
వృషభం :- వృత్తిపరమైన ఆటంకాలు క్రమంగా తొలగిపోగలవు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. కాంట్రాక్టర్లకు కార్మికులతో సఖ్యత నెలకొంటుంది. దంపతుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. కొన్ని విషయాల్లో మీరెంత తెలివిగా వ్యవహరించినా ఫలితాలు భిన్నంగానే ఉంటాయి.
 
మిథునం :- బ్యాంక్ వ్యవహారాలలో మెళకువ వహించండి. తలపెట్టిన పనులు వేగవంతమవుతాయి. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. భాగస్వామికుల మాటతీరు, కదలికలను గమనించటం ఎంతైనా మంచిది.
 
కర్కాటకం :- శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి.
 
సింహం :- కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. విద్యాసంస్థల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. రుణయత్నాలు మాత్రమే ముందుకు సాగుతాయి.
 
కన్య :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమస్యలు పరిష్కారంకావని గ్రహించండి. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసివస్తుంది. 
 
తుల :- పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. రవాణా రంగాలలోని వారికి చికాకులు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. ప్రయాణాలలోనూ, బ్యాంక్ వ్యవహారాలలోను ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరవుతాయి. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులనకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు, వైద్యులకు అనుకూలత.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. స్త్రీలతో అతిగా సంభాషించటం వల్ల అపార్థాలకు గురికావలసివస్తుంది. విద్యార్థులకు మిత్రబృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. స్థిరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం మంచిది.
 
మకరం :- స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పత్రికా సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. నిర్మాణ పనులలో జాప్యం, అధిక వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. రావలసిన ధనం వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు.
 
కుంభం :- ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పనిచేయవలసి ఉంటుంది. సభా సమావేశాలలో పాల్గొనడం వల్ల ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు.
 
మీనం :- ఆర్థిక పరిస్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. చిన్న చిన్న విషయాలలో ఉద్రేక పడటం మంచిది కాదని గ్రహించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కంద షష్ఠి.. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు.. పూజ ఇలా?