Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-09-2023 శుక్రవారం రాశిఫలాలు - శివుడిని ఆర్చించిన సర్వదా శుభం...

Virgo
, శనివారం, 16 సెప్టెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ పాఢ్యమి ఉ.7.53 ఉత్తర ఉ. 7.32 సా.వ.4.38 ల 6.22. ఉ.దు.5.48 ల 7.28.
 
శివుడిని ఆర్చించిన సర్వదా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృద్ధి కానవస్తుంది. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహారించండి.
 
వృషభం :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు కళాత్మక, క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయికతో పనులు పూర్తవుతాయి. మీ సమస్య ఒకటి సానుకూలం కావటంతో మానసికంగా కుదుటపడతారు.
 
మిథునం :- ఊహించని ఖర్చులు అధికం అగుటవలన ఆందోళన చెందుతారు. సోదరీ సోదరుల మధ్య ఏకీభవం కుదరదు. టి.వి., రేడియో రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్థిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులు విసుగు కలిగిస్తాయి.
 
కర్కాటకం :- దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహరాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు.
 
సింహం :- ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
కన్య :- రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికమవుతాయి. హోల్‌సేల్ కంటే రిటైల్ వ్యాపారాలే బాగుంటాయి. గృహమునకు కావలసిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
తుల :- నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోగలవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది.
 
వృశ్చికం :- వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత బాగా అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధికమిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం.
 
ధనస్సు :- మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. బంధువు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. స్త్రీల అనాలోచిత వ్యాఖ్యలు, చర్యలు సమస్యలకు దారితీస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత, ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం :- మీ సంతానం మొండి వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్తకొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు.
 
కుంభం :- ధనం ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. దంపతుల మధ్య దాపరికం అపార్థాలకు దారితీస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి ఒత్తిడి పెరుగుతుంది. సమయోచితంగా నిర్ణయం తీసుకుని ఒక సమస్యను అధికమిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంజనేయుడి తోక పట్టుకున్న శనీశ్వరుడు.... ఏలినాటి శని ఏమీ చేయదా?