Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-01-2024 ఆదివారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని ఆరాధించిన శుభం...

astro8

రామన్

, ఆదివారం, 21 జనవరి 2024 (04:30 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ ఏకాదశి రా.9.20 రోహిణి తె.5.41 రా.వ.9.44 ల 11.19. సా.దు.4.07 ల 4.52.
రాఘవేంద్రస్వామిని ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరగలదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలు భేషజాలకు, మొహమ్మాటాలకు పోవటం మంచిది కాదు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
వృషభం :- ఒక సందర్భంలో మిత్రుల తీరు మీకు మనస్తాపం కలిగిస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్ధిక పరిస్థితిలో ఆశాజనకమైన మార్పులు సంభవిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు.
 
మిథునం :- ఖర్చుల విషయంలో ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్థులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఆప్తుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. 
 
కర్కాటకం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశములు లభిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పోగుట్టుకునే అవకాశం ఉంది.
 
సింహం :- ఆర్ధిక కార్యకలాపాలు సానుకూలంగా సాగుతాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఆలస్యంగానైనా అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి.
 
కన్య :- సహోద్యోగులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కోల్పోయిన అవకాశం, వస్తువులు చేజిక్కుంచుకుంటారు. భార్యా, భర్తల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మిత్రులతో సంప్రదింపులు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, వ్యాపకాలు అధికమవుతాయి.
 
తుల :- విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రజన్నం చేసుకుంటారు. విద్యార్ధులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. బంధువుల కోసం మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
వృశ్చికం :- ప్రముఖులను కలుసుకుంటారు. ఋణవిముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేధాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
ధనస్సు :- చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. చిన్ననాటి స్నేహితుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చరాన్ని కలిగిస్తాయి. కుటుంబ విషయలలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది.
 
మకరం :- ఆర్థిక కార్యక్రమాలు అనుకూలంగా నడుచును. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు షాపింగ్లోను, వాహనం నడుపు తున్నప్పుడు ఏకాగ్రత అవసరం. మీ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు.
 
కుంభం :- ఆరోగ్యంలో అధిక జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పులు గమనిస్తారు. ఎదుటివారు మీ సమర్ధతను గుర్తిస్తారు. పెద్దతో కుటుంబ విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు.
 
మీనం :- విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగాఉంటడం మంచిది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. ఉమ్మడి ఆర్ధిక లావాదేవీలలో మాట పడవల్సి రావచ్చు. కళాకారులకు పోత్సహకరంగా ఉంటుంది. బంధువుల రాకతో ఖర్చులు అధిమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21.01.2024 నుంచి 27.01.2024 వరకు మీ వార రాశిఫలితాలు