Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-02-2024 బుధవారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన శుభం....

Astrology

రామన్

, బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ ద్వాదశి ప.12.39 పునర్వసు ప.3.34 రా.వ.12.08 ల 1.51. పదు. 11. 52 ల 12.37.
శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అధికారులు ధనప్రలోభాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
వృషభం :- ఆర్థిక వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలను సమర్థంగా నడిపిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. సన్నిహితులకు మీపై అపోహలు తొలగిపోగలవు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకువస్తాయి.
 
మిథునం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాల దిశగా ఆలోచిస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సాన్నిత్యం నెలకొంటుంది. సంకల్ప బలం ముఖ్యమని తెలుసుకోండి.
 
కర్కాటకం :- ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది.
 
సింహం :- నచ్చని విషయాల్లో సర్దుకుపోవలసి ఉంటుంది. కోర్టు, ఆస్తి, భూ సంబంధిత వివాదాలు జఠిలమవుతాయి. రుణయత్నం ఫలించి ధనం అందుతుంది. ఆరోగ్య విషయంలో ఏమరుపాటు తగదు. మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. జాయింట్ వెంచర్లు, ఏజెన్సీలు, లీజు గడువు పొడిగింపులకు అనుకూలం.
 
కన్య :- వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు సంభవం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. రావలసిన ధనం అందుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి.
 
తుల :- హోటల్, క్యాటరింగ్ వ్యపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దైవకార్యం పట్ల ఆసక్తి నెలకొంటుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
వృశ్చికం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులతో పట్టింపులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహరాలతో తీరిక ఉండదు.
 
ధనస్సు :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. భాగస్వామికులకు మీసమర్థతపై నమ్మకం కలుగుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణంతో ఇబ్బందు లెదుర్కుంటారు. ఇసుక కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, జరిమానాలు తప్పవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
మకరం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా వ్యక్తం చేయండి. స్వలాభం కంటె ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. లైసెన్సుల రెన్యువల్‌లో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సాన్నిత్యం నెలకొంటుంది. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం తధ్యం.
 
కుంభం :- విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. కిరణా, ఫాన్సీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. నిరుద్యోగులకు అశాజనకం. పారిశ్రామిక, రవాణా రంగాల వారు స్వల్ప చికాకులను ఎదుర్కొంటారు.
 
మీనం :- వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపంవల్ల అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీష్మ ఏకాదశి.. విష్ణు సహస్రనామాన్ని చదివితే?