Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25-12-2023 సోమవారం రాశిఫలాలు - దత్తాత్రేయుడిని ఆరాధించిన శుభం..

astro10
, సోమవారం, 25 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ|| చతుర్ధశి తె.5.12 రోహిణి రా.9.48 ప.వ.1.49 ల 3.25 తె.వ. 3.30 ల 5.08. ప.దు. 12.11 ల 12.55 పు.దు. 2.23ల3.07.
 
దత్తాత్రేయుడిని ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగాసాగుతాయి. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులను కలుసుకుంటారు.
 
వృషభం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయనాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. మీ కుటుంబీకులతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు.
 
మిథునం :- నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
కర్కాటకం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కార్యసాధనలో జయం, మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవటం ఉత్తమం.
 
సింహం :- కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
కన్య :- స్త్రీలకు శమాధిక్యత, విశ్రాంతిలోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు అధిక శ్రమవల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. సన్నిహితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల అభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త స్కీములు అమలుచేస్తారు.
 
తుల :- స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు, దూరప్రయాణాల్లో మెళకువ వహించండి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా ప్రకారమే నడుచుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు, రాబడి విషయాలలో మెళకువ వహించండి.
 
ధనస్సు :- సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరీ, సోదరుల మధ్యవిభేదాలు తలెత్తుతాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. వాహనం నడుపునపుడు జాగ్రత్తఅవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు.
 
మకరం :- నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఖర్చులు మీ అంచనాలను మించటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం :- చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదరుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతుంది. మీ శ్రీమతితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులు, ఆత్మీయులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ చాలా అవసరం.
 
మీనం :- స్థిరచరాస్తుల విక్రయం, తక్కువ రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహిస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. వేడుకలు, దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-12-2023 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా...