Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-10-2023 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని మంకెనపూలతో ఆరాధించిన శుభం...

Astrology
, శనివారం, 28 అక్టోబరు 2023 (04:00 IST)
మేషం :- వారసత్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. ఎవరికైన ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. జాగ్రత్త వహించండి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఆహార వ్యవహరాల్లో మెళకువ వహించండి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు.
 
వృషభం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. కీలకమైన వ్యవహరాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిథునం :- సమయానికి కావలసిన పత్రాలు, వస్తువులు కనిపించక ఇబ్బంది పడతారు. సమయానికి కావలసిన పత్రాలు, వస్తువులు కనిపించక ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
కర్కాటకం :- రవాణా కార్యక్రమాలలో చురుకుదనం కానవస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
సింహం :- రుణాల కోసం అన్వేషిస్తారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. పెద్దలతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థినులకు క్యాంపస్ సెలక్షనులో నిరుత్సాహం తప్పదు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
కన్య :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
 
తుల :- ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. చిన్ననాటి మిత్రులు అనుకోకుండా తారసపడతారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికంగా ఉంటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అనవసరం.
 
వృశ్చికం :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు లాభిస్తాయి. మీ ప్రమేయంలేకున్నా మాటపడవలసి వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి వైఖరిలో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు :- టాక్స్ వంటి సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కీలకమైన వ్యవహరాలు గోప్యంగా ఉంచండి. ఎదుటివారిని నొప్పించకూడదన్న స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకుంటారు.
 
మకరం :- స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. దంపతుల మధ్య అవగాహన కుదరదు. మీ మేలు పొందిన వారే మీపై అభాండాలు వేసేందుకు యత్నిస్తారు.
 
కుంభం :- వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. ఊహించని రీతిలో ప్రయాణాలు చేస్తారు.
 
మీనం :- అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగాభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. కార్యసాధనలో ఆటంకాలు తొలగి వ్యవహారాలు సానుకూలమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-10-2023 శుక్రవారం రాశిఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...