Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-02-2024 గురువారం మీ రాశిఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం..

Weekly astrology

రామన్

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ పంచమి రా.2.25 చిత్త ఉ.7.34 ప.వ.1.34 ల 3.17.
ఉ. దు. 10. 20 ల 11.06 ప.దు. 2.51 ల 3.36.
సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికం.
 
వృషభం :- ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు ప్రయత్నాలకు ఆటంకాలు తప్పవు. మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి.
 
మిథునం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాతావరణంలోమార్పు వల్ల స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.
 
కర్కాటకం :- పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోగతి కానరాగలదు. కుటుంబీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వృత్తిపరంగా ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. గృహ వాస్తు నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి. 
 
సింహం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. నిర్మాణ పనులో చికాకులు తప్పవు. విద్యార్ధినులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
కన్య :- వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి లాభాలు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ వంటివి ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
తుల :- ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాట వేయండి. ఉద్యోగస్తులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు మంచి అవకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- సన్నిహితుల కిచ్చినమాట నిలబెట్టుకుంటారు. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు.
 
ధనస్సు :- భాగస్వామిక ఒప్పందాలు, హామీలు, చెల్లింపుల్లో జాగ్రత్త వహించండి. యత్నాలు ఫలించక, అవకాశాలు కలిసిరాక విరక్తి చెందుతారు. మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచవద్దు.
 
మకరం :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెళకువ అవసరం. రాబోయే ఖర్చులకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు.
 
కుంభం :- రుణాలు చేస్తారు. అనుమానాలు, అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. అధికారులకు మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి.
 
మీనం :- చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఓర్పుతో పరిస్థితులను భరించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఇతర ఆలోచనలు విరమించుకుని ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-02-2024 బుధవారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం...