Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుప్పింటాకు.. ఈ మొక్క వేర్లతో పళ్ళను తోమితే..?

kuppintaku
, శనివారం, 12 ఆగస్టు 2023 (16:04 IST)
కుప్పింటాకులో ఔషధ గుణాలు పుష్కలంగా వున్నాయి. శరీర నొప్పులను తొలగించేందుకు కుప్పింటాకును బాగా నూరి.. కొబ్బరి నూనెతో మరిగించి శరీరానికి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కుప్పింటాకు పేస్టును ముఖానికి రాసుకుంటే మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
కుప్పింటాకును బాగా పేస్టులా చేసుకుని అందులో పసుపు చేర్చి గాయం తగిలిన చోట రాస్తే గాయం త్వరగా మానిపోయింది. కుప్పింటాకును దద్దుర్లున్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. కుప్పింటాకు మొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి. అంతేకాకుండా చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది. 
 
కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద మందుగా కుప్పింటాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్‌లో కొన్ని కుప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి. తర్వాతి రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే  పన్ను నొప్పి తగ్గుతుంది. 
 
ఈ మొక్క ఆకుల ర‌సాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయ‌డం వ‌ల్ల నొప్పులు త‌గ్గుతాయి. ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా చేసి అందులో కొద్దిగా ప‌సుపును క‌లిపి ముఖానికి రాసి 15 నిమిషాల త‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డిగేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. 
 
ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు కూడా తొల‌గిపోతాయి. కుప్పింటాకు చెట్టు ఆకుల నుండి ర‌సాన్ని తీసుకుని అందులో నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి చ‌ర్మానికి రాసుకోవ‌డం వ‌ల్ల గ‌జ్జి, తామ‌ర వంటి వాటితో పాటు దుర‌ద‌లు, ద‌దుర్లు త‌గ్గుతాయి. 
 
ఈ చెట్టు ఆకుల ర‌సాన్ని నుదుటిపై రాసుకోవ‌డం వ‌ల్ల త‌లనొప్పి త‌గ్గుతుంది. త‌ల‌నొప్పి తీవ్రంగా ఉన్న‌ప్పుడు ఈ చెట్టు ఆకుల ర‌సాన్ని రెండు చుక్క‌ల చొప్పున ముక్కు రంధ్రాల‌లో వేసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త‌గ్గుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మామిడి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. కాల్చి బూడిద చేసి..?