Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాలతో పసుపు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే? పసుపు-కొత్తిమీర ప్యాక్ ఎలా..?

పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది. * చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.

పాలతో పసుపు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే? పసుపు-కొత్తిమీర ప్యాక్ ఎలా..?
, సోమవారం, 1 ఆగస్టు 2016 (11:35 IST)
* పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.
 
* చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. 
 
* గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.
 
* మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన నివారింపబడతాయి.

* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
 
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మ రోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 
* పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 
* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి చర్మానికి నిగారింపు వస్తుంది.
 
* పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
 
* రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
 
* పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
 
* పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పట్టిస్తుంటే.. మొటిమలు-మచ్చలు నివారించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? 40 రోజుల్లో పొట్ట తగ్గాలా..? ఐతే ఇలా చేయండి!