Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రయాణంలో తీసుకోవాల్సిన 5 పదార్థాలు.. పెరుగు, నాచోస్..?

ప్రయాణంలో తీసుకోవాల్సిన 5 పదార్థాలు.. పెరుగు, నాచోస్..?
, గురువారం, 12 అక్టోబరు 2023 (22:16 IST)
ప్రయాణిస్తున్నప్పుడు ఆకలి బాధలను పోగొట్టడానికి మీ బ్యాగ్‌లో ఉంచుకోవాల్సిన 5 ఆహార పదార్థాలు ఏంటి అనేవి తెలుసుకుందాం. ప్రయాణం సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. అందుకే ప్రయాణంలో మీరు మీ బ్యాగ్‌లో తీసుకెళ్లగల ఆహార పదార్థాల జాబితాను తెలుసుకుందాం.
 
ఆకలి అలారంతో రాదు. ప్రయాణిస్తున్నప్పుడు ఆకలిని భరించడం కష్టమవుతుంది. అందుకే స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లపై ఎల్లప్పుడూ ఆధారపడకుండా.. హెల్దీ ఫుడ్ బ్యాగులో వుంచుకోవడం మంచిది.
 
పెరుగు: 
ప్రయాణంలో మీరు మీ బ్యాగ్‌లో ఉంచుకోవలసిన ఉత్తమ ఆహార పదార్థాలలో పెరుగు ఒకటి. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. పెరుగును చిప్స్ లేదా నాచోస్‌తో పాటు తినవచ్చు.
 
నట్స్.. ఫ్రైడ్ సీడ్స్ 
 
బాదం, ఫ్రైడ్ సీడ్స్ పోషక విలువలను కలిగివుంటాయి. మిడ్‌వే స్నాకింగ్ కోసం ఫ్రైడ్ సీడ్స్, బాదం పప్పులను బ్యాగ్‌లో ఉంచుకోవచ్చు.
 
ఆరోగ్యకరమైన స్నాక్ బార్
 
బ్యాగ్‌లో ఉంచుకోగలిగే అనేక రకాల ఇతర స్నాక్ బార్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. హెల్దీ స్నాక్ బార్ పూర్తిగా ప్రయాణానికి అనుకూలమైనవి.
 
మఫిన్స్
:
మఫిన్లు
 బ్యాగ్‌లో తీసుకెళ్లవచ్చు. చాక్లెట్, స్ట్రాబెర్రీ మొదలైన రుచిగల మఫిన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని అభిరుచికి అనుగుణంగా ఎంచుకోవచ్చు.
 
పండ్ల రసం: 
ప్రయాణంలో బ్యాగ్‌లో ఉండవలసిన చివరి ఆహార పదార్థం పండ్ల రసం (ఇంట్లో ఉసిరి రసాన్ని సిద్ధం చేసుకోవాలి). ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ఆకలిని తీర్చడానికి ఉసిరి జ్యూస్‌తో పాటు చిప్స్ లేదా నాచోస్‌ని తీసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుతుక్రమ సమయంలో ఉండే ఇబ్బందులను తొలగించే దానిమ్మ