Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుతుక్రమ సమస్యలను తొలగించే అంజీర..

అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీరను నిలువ చేసుకుని వాడుకోవచ్చు. ఇది జీర్ణాశయాన్ని శుభ్రపరచడంతో పాటు, జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది. వీటిని తరుచూగా తీసుకోవడం వలన పిత్తాశయం, కాలేయం, ప

రుతుక్రమ సమస్యలను తొలగించే అంజీర..
, సోమవారం, 7 మే 2018 (14:41 IST)
అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీరను నిలువ చేసుకుని వాడుకోవచ్చు. ఇది జీర్ణాశయాన్ని శుభ్రపరచడంతో పాటు, జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది. వీటిని తరుచూగా తీసుకోవడం వలన పిత్తాశయం, కాలేయం, ప్లీయా సంబంధిత సమస్యలు సమసిపోతాయి. ప్రత్యేకించి రుమాటిజం, ఆర్థరైటిస్ బాధితులను ఇదొక గొప్ప ఔషదం. 
 
రక్తాన్ని పలచబరిచే వీటికున్న ప్రధాన గుణం అంజీరలో వుండటం వల్ల కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గిపోతాయి. రెండు మూడు ఎండు అంజీర పండ్లను ఒకటి రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత తినేస్తే అందులోని పోషకాన్ని పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి. 
 
షుగర్‌తో ప్రమాదమనుకుని చాలామంది మధుమేహులు స్వీట్స్‌కు పూర్తిగానే దూరంగా ఉంటారు. నిజానికి శరీరానికి ఎంతో కొంత మోతాదులో షుగర్ కూడా అవసరమే. అలాంటి వారికి అంజీర పండ్లు ఒక మంచి ప్రత్యామ్నాయం. కఫం బాగా పేరుకుపోవడం వల్ల వచ్చే దగ్గుతో పాటు, శ్వాసకోశ పరమైన ఇబ్బందులు, ఉబ్బసం వంటి ఇతర సమస్యల నుంచి చక్కని ఉపశమాన్ని ఇచ్చేవి ఎండు అంజీర పండ్లు. 
 
ఒకటి రెండు పండ్లను రెండు గంటల పాటు నీళ్లల్లో నానబెట్టి, ఆ తర్వాత గ్లాసు పాలల్లో వేసి మరిగించి, రోజుకు రెండు పూటలా సేవిస్తే, చాలా త్వరితంగా ఉపవమనం పొందవచ్చు. కొంత మంది కళ్లు ఏమాత్రం తేమ లేనంతగా పొడిబారిపోతాయి, కళ్లల్లో దురద, మంట కూడా రావచ్చు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే అంజీర పండ్లు కళ్లకు ఆ దృష్టిలోపాలు కూడా చాలావరకు తగ్గుతాయి. 
 
రుతుక్రమ సమస్యలున్న మహిళలకు అంజీర ఒక దివ్య ఔషధం. ముఖ్యంగా బహిష్టు సమయంలో అధికరక్తస్రావం అవుతున్నప్పుడు రోజుకు రెండు సార్లు నానబెట్టిన రెండేసి అంజీర పండ్లను తింటే సమస్య అదుపులో వస్తుంది. ఉడికించిన రెండు అంజీర పండ్ల చొప్పున రోజుకు రెండు మూడు సార్లు తింటే, గొంతు నొప్పి తగ్గుతుంది.
 
రక్తహీనతను తొలగించడంలో అంజీర బాగా పనిచేస్తుంది. ఇతరమైన పలు శక్తిహీనతల నుంచి కూడా ఇది కాపాడుతుంది. మూడు అంజీర పండ్లను ఒక కప్పు నీళ్లల్లో ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మరో గ్లాసు నీళ్లు చేర్చి మరగించండి. ఆ నీళ్లల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఐదు నెలల పాటు తీసుకుంటే శరీరం బాగా శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే.. ఆలివ్ ఆయిల్, డైరీ ఉత్పత్తుల్ని?