Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భిణీ మహిళలు రోజూ కప్పు ఆకుకూర.. ఓ కోడిగుడ్డు తీసుకోవాల్సిందే...

గర్భిణీ స్త్రీలు కోడిగుడ్లు తీసుకుంటే గర్భస్థ శిశువు ఆరోగ్యానికి, కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అందుకే రోజూ ఒక కోడిగుడ్డును డైట్‌లో చేర్చుకోవాలి. ప్రెగ్నన్సీ టైమ్‌లో చేపలు ఖచ్చితంగా

గర్భిణీ మహిళలు రోజూ కప్పు ఆకుకూర.. ఓ కోడిగుడ్డు తీసుకోవాల్సిందే...
, మంగళవారం, 30 జనవరి 2018 (12:00 IST)
గర్భిణీ స్త్రీలు కోడిగుడ్లు తీసుకుంటే గర్భస్థ శిశువు ఆరోగ్యానికి, కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అందుకే రోజూ ఒక కోడిగుడ్డును డైట్‌లో చేర్చుకోవాలి. ప్రెగ్నన్సీ టైమ్‌లో చేపలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా లభించడం వల్ల.. బేబీ నరాల వ్యవస్థను బలంగా మారుస్తాయి.
 
యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి.. కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి చాలామంచిది. గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఇదెంతో మేలు చేస్తుంది. బీన్స్, రాజ్మాలలో ప్రొటీన్ లభిస్తుంది. ఇవి.. హెల్తీ బేబీని పొందడానికి సహాయపడతాయి. అందుకే గర్భంగా ఉన్నప్పుడు డైట్‌లో తరచుగా రాజ్మా, బీన్స్ ఉండేలా జాగ్రత్తపడాలి.
 
ప్రెగ్నన్సీ సమయంలో స్వీట్ పొటాటో లేదా చిలకడ దుపం తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి, ఫోలేట్ ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో వాల్ నట్స్‌ని డైట్ లో చేర్చుకోవడం వల్ల.. అందులో లభించే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 
బాదాంలో విటమిన్ ఈ, ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి.. కడుపులోని బిడ్డ ఎముకలు డెవలప్ అవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే రోజుకు రెండు బాదం పప్పుల్ని తీసుకోవాలి. పాలల్లో విటమిన్స్, ప్రొటీన్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి గర్భధారణ సమయంలో పాలు లేదా పాల ఉత్పత్తులను డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.
 
గర్భంగా ఉన్నప్పుడు బార్లీని తరచుగా తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ అందుతాయి. ఇవి.. కడుపులోని బిడ్డకు పోషణ అందించి.. ఎనర్జీని ఇస్తాయి. శెనగలను.. ప్రెగ్నన్సీ టైంలో డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఇందులోని పుష్కలమైన ప్రోటీన్స్ గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 
పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది.. కడుపులోని శిశువు ఆరోగ్యానికి, హెల్తీ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి సహాయపడతాయి. అందుకే పాలకూరను వారంలో రెండుసార్లు గర్భంగా ఉన్న మహిళ తీసుకోవాలి. గర్భంగా ఉన్న మహిళలు రోజూ ఓ కప్పు ఆకుకూర తీసుకోవాలి. అప్పుడే గర్భస్థ శిశువుకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ఐరన్ లభిస్తుంది. దీంతో శిశువు బలంగా పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల్లో ఆ సమస్యకు ఇవే కారణాలు?