Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
, శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (20:08 IST)
గర్భంతో ఉన్న ఆడవారు ముందు నుండి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇలా తీసుకోవటం వలన గర్భవతిగా వున్న సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కొనవచ్చు. తయారుచేసుకున్న ప్రణాళికలో కావలసిన పోషకాలను సరైన మోతాదులో ఉండేలా మరియు ఆహారాన్ని తగిన సమయంలో తీసుకోవాలి.
 
1. మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా క్యాల్షియం, ప్రోటీన్స్, ఐరన్, విటమిన్ సి మరియు ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆడవారు మాములుగా తీసుకునే దాని కంటే గర్భంతో ఉన్న సమయంలో ప్రతిరోజు 300 నుండి 400 క్యాలోరీలను ఎక్కువ తీసుకోవాలని ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన వైద్యులు అందరు తెలిపారు, ముఖ్యంగా ప్రసవానికి ముందుగా తప్పకుండా తీసుకోవాలి.
 
2. గర్భంతో ఉన్నవారు ముఖ్యంగా తీసుకోవలసిన ఇంకొక మూలకం మినరల్స్. గర్భ సమయంలో వారి శరీరం లోపల మరియు బయట వచ్చే మార్పులకు తట్టుకొని, ఆరోగ్యవంతమైన ప్రసవం జరగాలి అంటే మినరల్స్ తప్పనిసరిగా అవసరం. ఆక్సిజన్, పోషకాలను శరీర అన్ని భాగాలకు అందేలా చేసే ఎర్ర రక్తకణాల ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా మినరల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
 
3. మీరు తీసుకునే ఆహారంలో అవసరం మేరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్ మరియు సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. గర్భ సమయంలో వారి జీర్ణక్రియ శక్తి తగ్గిపోతుంది. కావున మీరు త్వరగా జీర్ణం కానీ ఆహారాన్ని తినటం వలన శరీరంలోని విసర్జక పదార్థాలు బయటికి పంపటంలో విఫలం అవటం వలన రక్తం చెడిపోయి ఇతరేతర ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. కావున త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి.
 
4. గర్భంతో ఉన్నవారు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, రోజు తీసుకునే ఆహారంలో పండ్లను తప్పకుండా తీసుకోవాలి.  ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను తినండి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు మరియు పాల పదార్థాలను తినాలి. మీ వైద్యుడిని సలహాలను పాటించి, కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోటానికి రోజు ఒక గ్లాసు అన్ని పండ్లు కలిపిన పండ్ల రసాన్ని తీసుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే...?