Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలోనే అతిపెద్ద గుహ సన్ డూంగ్ కేవ్!!

ప్రపంచంలోనే అతిపెద్ద గుహ సన్ డూంగ్ కేవ్!!
File
FILE
ప్రపంచంలో ఎన్నో వింతలూ విశేషాలు ఉంటాయి. ఇవి అడవులు, భూ, సముద్ర భూగర్భాల్లోనూ ఉంటాయి. ఇలాంటి వింతల్లో వియత్నాం అడవుల్లో ఉన్న అతిపెద్ద గుహ ఒకటి. దీని పేరు "సన్‌ డూంగ్‌ కేవ్" అని పిలుస్తారు. దీని పొడవు 262, ఎత్తు కూడా 262 అడుగులు. 4,5 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇప్పటివరకు బయటపడిన గుహల్లో ఇదే అతిపెద్దదని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

నేషనల్‌ గ్రాఫిక్‌ న్యూస్‌ సంస్థ ఈ అతిపెద్ద గుహను కనిపెట్టింది. దీంతో అంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద గుహగా రికార్డు సృష్టించిన మలేషియాలోని డీర్‌ కేవ్‌ రికార్డు తుడిచిపెట్టుకుని పోయింది. ఇది వియత్నాంలోని బో ట్రాక్‌ జిల్లాలో ఉన్న ఫొంగ్‌ నా కె బాంగ్‌ నేషనల్‌ పార్క్‌లో ఉంది. ఈ గుహను స్థానికుడైన హో కాన్‌ అనే వ్యక్తి తొలిసారిగా 1991లో గుర్తించాడు. భూగర్భంలో ప్రవహించే ఓ నది వల్ల ఈ గుహ ఏర్పడినట్టు ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో తేలింది.

తొలిసారిగా 1991లో వార్తల్లోకి వచ్చినప్పటికీ.. 2009 వరకు దీనిని అధికారికంగా ప్రకటించలేదు. 2009లో ఏప్రిల్‌ 10-14 తేదీల మధ్య శాస్త్రవేత్తలు హోవార్డ్‌, డెబ్‌ లింబర్ట్‌ సారథ్యంలోని "బ్రిటీష్‌ కేవ్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌", ఫొంగ్‌ నా - కె బాంగ్‌ నేషనల్‌ పార్క్‌లో చేపట్టిన సర్వేలో ఈ గుహ పూర్తి స్వరూపం వెలుగు చూసింది. అప్పటి నుంచి ఈ గుహ ప్రపంచంలోనే అతిపెద్ద గుహగా రికార్డు సృష్టించింది.

Share this Story:

Follow Webdunia telugu