Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది నల్లధనమే : కౌశిక్ బసు

భారత ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది నల్లధనమే : కౌశిక్ బసు
, సోమవారం, 22 ఫిబ్రవరి 2016 (16:07 IST)
విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న భారతీయ నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం సుప్రీంకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ గట్టిగా నిలబడటానికి ప్రధాన కారణం నల్లధనమేనని ప్రముఖ ఆర్థికవేత్త, వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్, భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు అంటున్నారు. 
 
ఈయన తాజాగా 'యాన్ ఎకానమిస్ట్ ఇన్ ది రియల్ వరల్డ్ - ఎకనామిక్స్ ఈజ్ నాట్ ఏ మోరల్ సబ్జెక్ట్' అనే పుస్తకాన్ని రచించి విడుదల చేశారు. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ విజయం వెనుక ఓ 'నీలినీడల కోణం' ఉందని పేర్కొన్నారు. ఆదాయపు శాఖ కన్నుగప్పి దాచిన నల్లధనమే బ్యాంకింగ్ సెక్టారును కాపాడిందని ఘంటాపథంగా చెపుతున్నారు. పంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ కుప్పకూలినప్పటికీ, ఇండియా తట్టుకుని నిలబడిన కారణాలను కూడా ఆయన విపులీకరించారు. 
 
దీనికితోడు భారత రిజర్వు బ్యాంకు కూడా ముందుజాగ్రత్తగా అనేక చర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు. ఇలాంటి చర్యల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కలిగిన లాభం కంటే... నల్లధనం వల్ల ఎంతో మేలు జరిగినట్టు పేర్కొన్నారు. 2008కి పూర్వం, వరుసగా మూడు సంవత్సరాల్లో భారత్ 9 శాతానికి మించిన వృద్ధిని నమోదు చేయడానికి కూడా కారణమిదేనన్నారు. ఇందులో అత్యధిక భాగం నిర్మాణ రంగంలో పెరిగిన డిమాండే అనడంలో సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu