Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విటెరో సెలక్ట్‌తో నెల్లూరులోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్

Tiles

ఐవీఆర్

, గురువారం, 4 ఏప్రియల్ 2024 (21:42 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిల్డింగ్ మెటీరియల్స్ తయారీసంస్థ అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, తమ నూతన విటెరో సెలెక్ట్ షోరూమ్‌ను తెరువటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ప్రవేశించినట్లు వెల్లడించింది. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమిళనాడులోని పొరుగు నగరాలతో పాటు నెల్లూరులోని ఇంటి యజమానులు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైన్‌లకు టైల్స్ ప్రపంచంలోని సరికొత్త పోకడలు, ఆవిష్కరణలను అన్వేషించడానికి అనుకూలమైన కేంద్రంగా సేవలను అందించనుంది. విటెరో సెలెక్ట్ షోరూమ్‌ల ద్వారా, అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ విభాగం, విట్రిఫైడ్ టైల్స్ యొక్క సమగ్ర ఎంపికలను విటెరో టైల్స్  అందిస్తుంది.
 
మొత్తం 700 విటెరో సెలెక్ట్ షోరూమ్‌ల నెట్‌వర్క్‌తో భారతదేశం అంతటా విస్తృత శ్రేణిలో కార్యకలాపాలను విటెరో టైల్స్ నిర్వహిస్తుంది. వృద్ధి- విస్తృత శ్రేణిలో కస్టమర్‌లకు చేరువ కావడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ, గత సంవత్సరంలోనే, కంపెనీ 200 నూతన షోరూమ్‌లను విజయవంతంగా ప్రారంభించింది. భారతదేశం అంతటా వ్యూహాత్మక విస్తరణతో పాటు వచ్చే ఏడాదిలోపు ఆంధ్రప్రదేశ్‌లో 40 అదనపు షోరూమ్‌లతో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ యోచిస్తోంది. ఈ పెరుగుదల అధిక-నాణ్యత టైల్స్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది, గత సంవత్సర కాలంలో 18 శాతం వృద్ధిని టైల్స్ మార్కెట్ సాధించింది.
 
విటెరో టైల్స్‌కు సంబంధించిన తమ విజన్‌ను అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి అపర్ణ రెడ్డి పంచుకుంటూ, “ పెరుగుతున్న పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కారణాలతో భారతీయ నిర్మాణ సామగ్రి విభాగం గణనీయమైన వృద్ధిని నమోదుచేస్తుంది. ఈ సానుకూల వృద్ధి అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ వృద్ధికి దోహద పడుతుంది. విటెరో టైల్స్‌తో సహా మా ఆఫర్‌లను దూకుడుగా విస్తరించడానికి వీలు కల్పిస్తుంది. ఈ కొత్త షోరూమ్ ప్రారంభం, అసాధారణమైన నాణ్యత, వినూత్న ఉత్పత్తులు మరియు అసమానమైన కస్టమర్ సేవతో ఈ  ప్రాంతమంతటా వివేకవంతులైన వినియోగదారులకు సేవలను అందించాలనే మా అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని అన్నారు 
 
ఈ సందర్భంగా విటెరో టైల్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వైభవ్‌ సరాఫ్‌ మాట్లాడుతూ, “ఈ ప్రారంభంతో, నెల్లూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో  ప్రీమియం టైల్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా కొత్త షోరూమ్ టైల్స్ కు సంబంధించి సమగ్ర కలెక్షన్ ను  ప్రదర్శిస్తుంది, వివిధ అభిరుచులకు తగినట్లుగా మాత్రమే కాకుండా ప్రాజెక్ట్‌ల అవసరాలను సైతం తీర్చనుంది. ఈ విస్తరణ ఈ ప్రాంతంలో మా బ్రాండ్ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంధన్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఆవిష్కరించిన బంధన్ మ్యూచువల్ ఫండ్