Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటరాక్టివ్ సెషన్- బిటుబి సమావేశాలను నిర్వహించనున్న అసోచామ్

Business
, సోమవారం, 20 నవంబరు 2023 (17:31 IST)
అత్యున్నత పరిశ్రమ సంస్థ, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సోహార్ పోర్ట్, ఒమన్‌లోని ఫ్రీజోన్ నుండి విశిష్ట ప్రతినిధి బృందంతో తమ వ్యాపార కార్యక్రమం, ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమాలు 2023 నవంబర్ 23 మరియు 24 తేదీల్లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరగనున్నాయి.
 
'గ్లోబల్ మార్కెట్‌లలో మీ వ్యాపారాన్ని విస్తరించడం' అనే నేపథ్యం తో ఈ కార్యక్రమం నవంబర్ 23 సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్‌తో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత నవంబర్ 23 & 24 తేదీల్లో B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్- మిడిల్ ఈస్ట్‌లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాల గురించి నగర ఆధారిత పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించేందుకు ఈ వ్యాపార కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. విదేశీ సంస్థలకు సోహార్ పోర్ట్, ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, ప్రోత్సాహకాల గురించి పరిజ్ఞానాన్ని ఈ సదస్సుకు హాజరైన వ్యక్తులు పొందుతారు. 
 
అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ & యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవి కుమార్ రెడ్డి కటారు మాట్లాడుతూ, "దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక మూలస్తంభంగా నిలుస్తుంది, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రంగా ఉంటే ఎలక్ట్రానిక్స్, ఐటి, ఏరోస్పేస్ మరియు ఇంజినీరింగ్ వంటివి  అభివృద్ధి చెందుతున్న రంగాలుగా వున్నాయి. గత దశాబ్ద కాలంలో నగరం నుండి ఎగుమతుల పెరుగుదలను మేము చూసినప్పటికీ, హైదరాబాద్ యొక్క నిజమైన సామర్థ్యాన్ని ఇంకా ఉపయోగించుకోలేదని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. మా రాబోయే సెషన్ ఈ సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కిల్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు