Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్ - మే నెలలో 12 రోజుల సెలవులు

bank holiday
, సోమవారం, 1 మే 2023 (14:44 IST)
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల ముగిసింది. మే ఒకటో తేదీ సోమవారం నుంచి మొదలైంది. ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ విషయంలో బ్యాంకు ఖాతాదారులు అలెర్ట్‌గా ఉండాలి. బ్యాంకు పనులకు వెళ్లేపని అయితే, ఈ సెలవులు చూసుకుని బ్యాంకులకు వెళ్లాలని అధికారులు సలహా ఇస్తున్నారు. ఆర్బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులు పనిచేయవు. మరో ఆరు రోజుల పాటు పండుగ రోజులు ఉన్నాయి. 
 
ఈ సెలవుల వివరాలను పరిశీలిస్తే, మే 7వ తేదీన ఆదివారం, 13వ తేదీన రెండో శనివారం, మే 14వ తేదీన ఆదివారం. మే 21వ తేదీన ఆదివారం, మే 27వ తేదీన నాలుగో శనివారం వస్తున్నాయి. సో.. ఈ రోజుల్లో బ్యాంకులు పని చేయవు. 
 
ఇక పండుగ సెలవులను పరిశీలిస్తే, మే ఒకటో తేదీన మే డే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, అస్సాం, తెలంగాణ, కేరళ, బెంగాల్, గోవా, బీహార్ రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు. మే 2వ తేదీన సిమ్లాలో మున్సిపల్ ఎన్నికలు. 
 
మే 5వ తేదీన బుద్ధ పౌర్ణమి. ఈ కారణంగా త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చండీఘడ్, ఉత్తరాఖండ్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవులు. 
 
మే 9వ తేదీన రవీనంద్రనాథ్ ఠాగూర్ జయంతి. దీంతో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు. మే 16వ తేదీన సిక్కిం రాష్ట్ర దినోత్సవం. సిక్కింలో బ్యాంకులకు సెలవు. మే 22వ తేదీన మహారాణా ప్రతాప్ జయంతి. హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు. మే 24వ తేదీన ఖాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో సెలవులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాకినాడలో విషాదం ... కారులో ఊపిరాడక చిన్నారి మృతి