Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య ఏటీఎం కార్డును భర్త వాడితే పంగనామమే... ఇదో వింత కేసు!

భార్య ఏటీఎం కార్డును వాడితే అంతే సంగతులని బ్యాంకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా, ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు రాకుంటే వాటిని తిరిగి పొందడం అసాధ్యమని తాజా జరిగిన ఘటన ఒకటి నిరూపి

భార్య ఏటీఎం కార్డును భర్త వాడితే పంగనామమే... ఇదో వింత కేసు!
, గురువారం, 7 జూన్ 2018 (14:10 IST)
భార్య ఏటీఎం కార్డును వాడితే అంతే సంగతులని బ్యాంకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా, ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు రాకుంటే వాటిని తిరిగి పొందడం అసాధ్యమని తాజా జరిగిన ఘటన ఒకటి నిరూపించింది. ఆ వివరాలను పరిశీలిస్తే...
 
బెంగళూరులోని మరతహళ్లికి చెందిన వందన అనే మహిళ తన ఎస్.బి.ఐ. డెబిట్ కార్డును భర్త రాజేష్‌ కుమార్‌కు ఇచ్చి రూ.25 వేలు తెమ్మని 2013 నవంబర్ 14వ తేదీన చెప్పింది. దీంతో ఓ మెషీన్‌లో నుంచి డబ్బు తీయడానికి ప్రయత్నించగా అకౌంట్‌లో నుంచి డబ్బు డెబిట్ అయింది కానీ.. ఏటీఎం యంత్రం నుంచి క్యాష్ మాత్రం బయటకు రాలేదు. 
 
కాల్‌సెంటర్‌కు కాల్ చేస్తే ఏటీఎం మెషీన్ సమస్య అని, 24 గంటల్లో డబ్బు అకౌంట్‌లోకి జమ చేస్తామని సమాధానమిచ్చారు. కానీ, డబ్బు జమ కాలేదు. దీంతో బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ కొన్ని రోజులకే వాళ్లు ఫిర్యాదును మూసేశారు. వాళ్లు చెప్పిన కారణం విని ఈ దంపతులకు షాక్ తగిలింది. 
 
సీసీఫుటేజీల ప్రకారం ఏటీఎం కార్డు కలిగిన 'ఖాతాదారు ఏటీఎం దగ్గర లేరని, డబ్బు ఇవ్వడం కుదరదని ఎస్.బి.ఐ తేల్చి చెప్పింది. దీంతో వందన 2014, అక్టోబర్ 21న బెంగళూరులోని వినియోగదారుల ఫోరమ్‌ని ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. వాదనల సమయంలో కార్డ్ ఎవరి పేరు మీద ఉన్నదో ఆ వ్యక్తి ఏటీఎం కేంద్రంలో లేదని స్పష్టంచేసింది. 
 
అలా కేసు మూడున్నరేళ్లు నడిచింది. వాస్తవానికి ఏటీఎం పిన్‌ను మరొకరితో పంచుకోవడం బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని, అలాంటప్పుడు డబ్బు ఎలా ఇస్తామని బ్యాంకు వాదించింది. చివరికి కోర్టు కూడా 2018, మే 29న బ్యాంకుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో డబ్బుతోపాటు ఈ దంపతుల విలువైన కాలం కూడా వృథా అయింది. సో.. భర్తలూ.. తస్మాత్ జాగ్రత్త. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రమణ దీక్షితులుకు ఇక కష్టాలే.. క్రిమినల్ కేసులు?.. పరువు నష్టందావా