Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జావా & జావా ఫార్టీ టూ... జావా మోట‌ర్ సైకిల్స్‌లో న్యూ జ‌న‌రేష‌న్‌

జావా & జావా ఫార్టీ టూ... జావా మోట‌ర్ సైకిల్స్‌లో న్యూ జ‌న‌రేష‌న్‌
, గురువారం, 15 నవంబరు 2018 (22:11 IST)
విభిన్న‌మైన స్టైల్ మ‌రియు విశిష్ట‌మైన రూపంతో ఉండే ఒరిజిన‌ల్ జావా నూత‌న జావాలో పున‌ర్ జ‌న్మించింది. పూర్వ‌పు ఉత్పాద‌న‌కు చెందిన విశిష్ట‌త మ‌రియు ప్రామాణికత మ‌రియు సౌక‌ర్య‌త‌తో పాటుగా సొగ‌సైన‌, అధునాత‌న‌, మ‌నోహ‌ర‌మైన‌, ఆక‌ట్టుకునే రూపంతో వార‌స‌త్వపు అభిరుచులు క‌లిగి ఉన్న‌వారికి మ‌రింత న‌చ్చే ఉత్పాద‌న ఇది. పూర్వ‌పు గుణం, పూర్తిగా అధునాత‌న ప‌నితీరు, అద్భుత‌మైన ప‌నితీరుతో నూత‌న జావా ఉత్పాద‌న అంద‌రి చూపును త‌న‌వైపు తిప్పుకుంటోంది.
 
జావా ఫార్టీ టూః
ఉత్త‌మ త‌ర‌గ‌తికి చెందిన ఈ నూత‌న ఉత్పాద‌న హ‌ద్దుల‌ను మ‌రియు ప్ర‌యోగాల ప‌రిమితుల‌ను చెరిపేస్తోంది. చురుకుద‌నాన్ని త‌న స్వ‌భావ‌శీలమైన డిజైన్‌లోనే క‌లిగి ఉండి నిండైన రూపంతో ఉన్న జావా ఫార్టీ టూ చూడ‌చ‌క్క‌ని రూపం, ఆక‌ట్టుకునే శైలి, విభిన్న‌త వంటి విశిష్ట‌త‌ల‌తో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంది.
  
ఇంజిన్‌:
జావా మ‌రియు జావా ఫార్టీటూకు చెందినవి ఇంజిన్ల సామ‌ర్థ్యం 293 సీసీ లిక్విడ్ కూల్డ్‌. సింగిల్ సిలిండ‌ర్‌, డీఓహెచ్‌సీ ఇంజిన్‌ను ఇటాలియ‌న్ ఇంజినీరింగ్ సామ‌ర్థ్యంతో రూపొందించారు. 27 బీహెచ్‌పీ పవ‌ర్ సామ‌ర్థ్యంతో 28 ఎన్ఎం టార్క్ మిడ్ రేంజ్‌తో మిలితం అయి ఉండి, ఫ్లాట్ టార్క్ క‌ర్వ్‌తో విభిన్న‌మైన సుదీర్ఘ‌మైన స‌వివ‌ర ప్ర‌యాణం సాగించేందుకు సిద్దంగా ఉంది.
 
రంగుల ఎంపికః
జావా మూడు క్లాసిక్ రంగుల‌లో వ‌స్తోంది. జావా మెరూన్‌, జావా గ్రే మ‌రియు జావా బ్లాక్‌. జావా ఫార్టీ టూ ఆరు ఆక‌ట్టుకునే రంగుల‌లో అందుబాటులో ఉంది. - గ్లాసీ మెటాలిక్ రెడ్‌, గ్లాసీ డార్క్ బ్లూ, మాట్ మాస్ గ్రీన్‌, మాట్ పాస్టెల్ బ్లూ, మాట్ పాస్టెల్ లైట్ గ్రీన్ మ‌రియు మాట్ బ్లూ. 
webdunia
 
ప్ర‌త్యేక‌మైన అంశాలు.
మోడల్- జావా & జావా ఫార్టీ టూ
ఇంజిన్- ట్రాన్స్ మిషన్
టైప్- సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీఓహెచ్సీ
కెపాసిటీ- 293 cc
బోర్ స్ట్రోక్- 76 x 65 mm
కంప్రెసన్- 11:1
మాక్స్ పవర్- 27 bhp
మాక్స్ టార్క్- 28 Nm
ఎక్సాస్ట్- ట్విన్ ఎక్సాస్ట్
గేర్ బాక్స్- కాన్‌స్టంట్‌ మెష్ 6 స్పీడ్
 
చాసిస్
ఫ్రేమ్- డబుల్ క్రాడిల్
ఫ్రంట్ టైర్- 90/90 - 18 
రియర్ టైర్స్- 120/80 - 17
ఫ్రంట్ సస్పెన్షన్- టెలీస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్క్స్
రియర్ సస్పెన్షన్- Gas canister - twin hydraulic shock absorbers గ్యాస్ కనిస్టర్- ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్జర్స్
బ్రేక్ ఫ్రంట్- ఫ్లోటింగ్ కాలిపర్ 280 ఎంఎం డిస్క్ మరియు ఏబీఎస్
బ్రేక్ రియర్ డ్రమ్ బ్రేక్ 153 ఎంఎం
డైమెన్షన్ మరియు బరువు
సీటు ఎత్తు- 765 ఎంఎం
వీల్ బేస్- 1369 ఎంఎం
కర్బ్ వెయిట్- 170 కిలోగ్రాములు
ట్యాంక్ కెపాసిటీ- 14 లీటర్లు 
బుకింగ్‌లు ప్రారంభమయ్యే తేదీ- 15 నవంబర్ 2018 నుంచి ఆన్ లైన్లో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయం పాట్నాలో ఫ్లైట్ ఎక్కాడు.. సాయంత్రం హైదరాబాద్‌లో పనికానిచ్చాడు..?