Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్

image
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (15:05 IST)
పూణేకు చెందిన ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC), MSMEలకు ఫైనాన్సింగ్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉన్న, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఎనర్జీ ఎఫెక్టివ్ మెషిన్ ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించిన ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్ (EFL), వరంగల్- సూర్యాపేటలో ఏడు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అత్యంత పారదర్శక పద్ధతిలో సౌకర్యవంతమైన రుణ సదుపాయాన్ని అందించడం ద్వారా తెలంగాణలోని చిన్న వ్యాపారాల ఆకాంక్షలను తీర్చడం కంపెనీ లక్ష్యం.
 
ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మార్కెట్‌లలో తమ రుణ ఉత్పత్తులను అందించిన తర్వాత, తెలంగాణలో తన లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ రుణాలను అందించడానికి EFL ఎదురుచూస్తోంది. దీని ద్వారా, EFL యొక్క ఉత్పత్తి సమర్పణ తెలంగాణలోని MSMEలు, వ్యక్తులకు క్రెడిట్ లభ్యతను మెరుగుపరుస్తుంది. విశ్వసనీయ క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించడంలో వారికి సహాయపడుతుంది. ఈ కంపెనీ తెలంగాణ సహా పలు ప్రాంతాలలో 50కి పైగా శాఖలను తెరవాలని యోచిస్తోంది.
 
తెలంగాణ మార్కెట్ అవకాశాలను గురించి ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, శ్రీమతి శిల్పా పోఫాలే మాట్లాడుతూ, “ దాదాపు 2.6 మిలియన్ల MSMEలకు నిలయంగా తెలంగాణ ఉందని అంచనా, వీటిలో 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. EFL తమ రుణాలను అందించటానికి ప్రణాళిక చేస్తున్న ప్రాంతం ఇది. మొదటిసారి రుణం తీసుకోగోరు వినియోగదారులకు ఇక్కడ రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక చేసింది. ఉదాహరణకు, నల్గొండ చేనేత కార్మికులు, సూర్యాపేట (ప్రధాన పత్తి ఉత్పత్తి జిల్లా), ఎర్ర మిర్చి (కామారెడ్డి), వరి/పత్తి (కరీం నగర్) వ్యవసాయ ఉత్పత్తిదారులు, చేనేత మరియు బొమ్మల కార్మికులు (నిర్మల్) లాంటి వారికి సకాలంలో మూలధన లభ్యత ద్వారా వారి వృద్ధి ప్రయాణంలో మద్దతు ఇస్తారు. ఈ విధంగా, EFL యొక్క రుణాలు కొత్త ఉపాధి అవకాశాలు, వ్యాపార విస్తరణకు మార్గాలు మరియు మెరుగైన జీవన ప్రమాణాలను సృష్టించడం ద్వారా రాష్ట్ర స్థానిక ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని పెంచుతాయి..." అని అన్నారు. 
 
కంపెనీ భారతదేశం అంతటా 175 కంటే ఎక్కువ శాఖలను ఏర్పాటు చేసింది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్యను 500 శాఖలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది, అలాగే తమ  సిబ్బందిని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. "ఈ వృద్ధికి అనుబంధంగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడం, సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం, ఇప్పటికే ఉన్న ప్రక్రియలను మెరుగుపరచడం చేయనున్నాము " అని పోఫాలే జోడించారు.
 
FY22-23లో, కంపెనీ అత్యధిక వ్యాపార వృద్ధిని సాధించింది, డిస్బర్స్మెంట్ పరంగా సంవత్సరానికి 65 శాతం కంటే ఎక్కువ పెరుగుదల మరియు రుణ పుస్తక వృద్ధి పరంగా సంవత్సరానికి 45 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదు చేసింది. " మేము గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభదాయకతను చూశాము.  ఇది  ఇయర్ ఆన్  ఇయర్ 40 శాతం కంటే ఎక్కువ గా వుంది.   కంపెనీ UN SDG లక్ష్యమైన ఆర్థిక చేరికకు దోహదం చేస్తోంది మరియు న్యూ టు క్రెడిట్ (NTC) కస్టమర్‌లకు నిధులు అందించడం ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించటంలో  సహాయ పడుతుంది.  ఇప్పటి వరకు 5,000 కంటే ఎక్కువ NTC రుణగ్రహీతలకు నిధులు అందించబడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంలో మా ఉద్యోగుల బలం కూడా రెట్టింపు అయింది” అని పోఫాలే పేర్కొన్నారు.
 
ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రుణ  వితరణ  మరియు లోన్ బుక్‌లో 50 శాతం వృద్ధిని సాధించాలని యోచిస్తోంది. డిజిటల్ ఆన్-బోర్డింగ్ మరియు ఇప్పటికే ఉన్న కార్యాచరణ ప్రక్రియల ఆటోమేషన్‌ను ప్రారంభించడానికి కంపెనీ ఈ సంవత్సరం తన మొబైల్ యాప్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉంది. నిరంతర సాంకేతిక పెట్టుబడులతో పాటుగా, అత్యుత్తమ సేవా నాణ్యత ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి EFL కట్టుబడి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగం పేరుతో మహిళకు గాలం.. 22 బంధించి అత్యాచారం.. ఎక్కడ?