Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరు నెలల కనిష్ట స్థాయికి బంగారం ధరలు

gold
, బుధవారం, 4 అక్టోబరు 2023 (13:28 IST)
దేశంలో బంగారు ధరలు నెలలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600గా ఉంది. అమెరికన్ డాలర్ రేటు పెరగడంతో దీనికి కారణంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా బంగారు ధరలు అస్థిరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు బాగా తగ్గాయి. ఆరు నెలల కనిష్ట స్థాయికి గోల్డ్ రేట్స్ పడిపోయాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.52,600గా వుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380గా ఉంది. అమెరికా డాలర్‌ విలువ పెరగడమే బంగారం ధరల తగ్గడానికి కారణం. కీలక వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు డాలర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో, అంతర్జాతీయ మార్కెట్‌ డాలర్ రేటు పెరిగిపోయింది. దీని కారణంగా గోల్డ్ రేట్‌లో కరెక్షన్స్ చోటుచేసుకుంటాయి. 
 
జూన్ 29న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ‌ధర రూ.53,850గా 24 క్యారెట్ల బంగార ధర రూ.58,750గా ఉంది ప్రస్తుత రేట్లతో ఈ ధరను పోల్చుకుంటే బంగారం ధర భారీగానే తగ్గినట్టు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు అస్థిరంగానే ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అధిక ద్రవ్యోల్బణం కారణంగా కీలక వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో దీనికి కారణమని చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తి కోసం ప్రముఖ సినీ నిర్మాత దారుణ హత్య