Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిమాలయ వెల్‌నెస్ కంపెనీ నుంచి వేసవిలో పునరుత్తేజానికి అల్టిమేట్ ఎలక్ట్రోలైట్ డ్రింక్

image

ఐవీఆర్

, గురువారం, 2 మే 2024 (19:03 IST)
రీ-హైడ్రేషన్, అలసటను ఎదుర్కొనేందుకు యాపిల్, ఆరెంజ్ రుచులలో తన తాజా ఉత్పత్తి హిమాలయ రీ-హైడ్రేట్‌ను భారతదేశంలోని ప్రముఖ వెల్‌నెస్ బ్రాండ్‌లలో ఒకటైన హిమాలయ వెల్‌నెస్ కంపెనీ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రోలైట్ పానీయం, శరీరం కోల్పోయిన పోషకాలను వేగంగా తిరిగి భర్తీ చేసేందుకు తయారు చేయగా, వినియోగదారులకు తాజాదనాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది.
 
హిమాలయా రీ-హైడ్రేట్‌ను ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగృతి కలిగిన వ్యక్తుల కోసం సైంటిఫిక్‌గా 40% తక్కువ మొత్తంలో చక్కెర, 50% కన్నా ఎక్కువ విటమిన్ సి-తో తయారుచేశారు. అలసట నుంచి త్వరగా కోలుకునేందుకు విటమిన్ సి సహాయపడుతుంది. కాగా, తక్కువ మొత్తంలో చక్కెర ఉండడంతో వివేకం కలిగిన నేటి తరం వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుంది.
 
జింక్‌తో పాటు సోడియం, క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఐదు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌ల మిశ్రమాన్ని కలిగి ఉండటం వల్ల హిమాలయా రీ-హైడ్రేట్‌ ద్వారా శరీరానికి ముఖ్యమైన పోషకాలు వేగంగా అందుతాయి. అదనంగా, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఉసిరి, దానిమ్మ వంటి సూపర్ ఫ్రూట్స్ మిశ్రమం శరీరం సహజ పునరుద్ధరణ ప్రక్రియకు మద్దతు ఇస్తుంది.
 
నూతన ఉత్పత్తి గురించి హిమాలయ వెల్‌నెస్ కంపెనీకి చెందిన బిజినెస్ హెడ్-ఓటీసీ వికాస్ బన్సీ మాట్లాడుతూ, ‘‘హిమాలయ రీ-హైడ్రేట్‌ ద్వారా ప్రకృతిలోని మంచితనాన్ని, సైన్సు అందించే హామీతో మిళితం చేసే పునరుజ్జీవన పరిష్కారాన్ని వినియోగదారులకు అందించడమే మా ప్రయత్నం. మా వినూత్న సూత్రీకరణ, నాణ్యత పట్ల తిరుగులేని నిబద్ధతతో ఆరోగ్య పానీయాల మార్కెట్‌లో ఈ వర్గంలో వృద్ధి పథాన్ని అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని వివరించారు. కొత్తగా విడుదల చేసిన ఈ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా 30,000 మంది వైద్యులు, 75,000 రిటైల్ స్టోర్‌లను చేరుకోవాలని హిమాలయ యోచిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పియాజియో ఇండియా 'బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మోడల్'తో ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు