Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరీరాన్ని స్కాన్ చేసి సూటయ్యే దుస్తులు తెలిపే స్మార్ట్ మిర్రర్

శరీరాన్ని స్కాన్ చేసి సూటయ్యే దుస్తులు తెలిపే స్మార్ట్ మిర్రర్
, గురువారం, 10 జనవరి 2019 (17:23 IST)
సాధారణంగా దుస్తుల కొనుగోలు చేయాలంటే అదో ప్రయాస. నాలుగైదు షాపులు తిరిగితేగానీ సరైన బట్టలను ఎంపిక చేసుకోలేం. ఇదంతా శ్రమతో కూడుకున్న పని. అయికే, అలాంటి శ్రమ. ఇబ్బంది అంతకంటే లేదు. ఎందుకంటే.. ఎల్.జి కంపెనీ తయారు చేసిన స్మార్ట్ మిర్రర్‌తో మనకు ఏ తరహా దుస్తులు సూట్ అవుతాయో ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ మిర్రర్ దుస్తులను ఎలా ఎంపిక చేస్తుందో ఓసారి తెలుసుకుందాం. 
 
ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్.జి క‌న్జ్యూమర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) 2019లో తాను నూత‌నంగా రూపొందిస్తున్న స్మార్ట్ మిర్ర‌ర్‌ను ప్ర‌ద‌ర్శించింది. ఈ మిర్ర‌ర్ ఎదురుగా నిల‌బ‌డితే చాలు, అందులో ఉండే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మ‌న శ‌రీరాన్ని స్కాన్ చేస్తుంది. మ‌న శ‌రీరం ఎత్తు, సైజ్, చ‌ర్మం క‌ల‌ర్ త‌దిత‌ర అనేక అంశాల‌ను బేరీజు వేసుకుని ఒక వ‌ర్చువ‌ల్ అవ‌తార్‌ను జ‌న‌రేట్ చేసి స్క్రీన్‌పై మ‌న‌కు చూపుతుంది. 
 
దీంతో ఆ అవతార్‌కు వివిధ ర‌కాల డ్రెస్సుల‌ను ధ‌రింప‌జేసి వాటిలో మ‌న‌కు ఏం న‌చ్చుతాయో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. అయితే మిర్ర‌ర్‌లో ముందుగానే ఆయా ర‌కాల డ్రెస్సుల‌కు చెందిన న‌మూనాల‌ను స్టోర్ చేసి పెట్టాల్సి ఉంటుంది. దీంతో మ‌న బాడీ స్కాన్ అవ‌గానే జ‌న‌రేట్ అయిన అవ‌తార్ ఆ దుస్తుల‌ను ధ‌రించి మ‌న‌కు చూపుతుంది. వాటిల్లో మ‌న‌కు కావ‌ల్సిన దుస్తుల‌ను మ‌నం సుల‌భంగా ఎంపిక చేసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల ప‌దే ప‌దే దుస్తుల‌ను ధ‌రించి స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన ఇబ్బంది త‌ప్పుతుంది. 
 
ఇక ఇదే స్మార్ట్ మిర్ర‌ర్‌ను ఇంట్లో పెట్టుకుంటే మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న దుస్తుల‌ను మీ అవ‌తార్‌కు ధ‌రింప‌జేసి చూపుతుంది. దీంతో వాటిల్లోనూ మీకు న‌చ్చిన దుస్తుల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. అయితే ఈ స్మార్ట్ మిర్ర‌ర్ ప్ర‌స్తుతం ప్రోటో టైప్ ద‌శలోనే ఉంది. వాణిజ్య ప‌రంగా ఈ మిర్ర‌ర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చే విషయాన్ని మాత్రం ఎల్.జి వెల్లడించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''నోకియా డేస్'' ఫ్లిఫ్‌కార్ట్ సూపర్ సేల్‌..