Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంజాగుట్టలో రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్... రానా దగ్గుబాటి చేతులు మీదుగా...

పంజాగుట్టలో రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్... రానా దగ్గుబాటి చేతులు మీదుగా...
, శనివారం, 13 అక్టోబరు 2018 (19:55 IST)
హైదరాబాద్: భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉండటంతో పాటు వేగంగా వృద్ధి చెందుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థ రిలయన్స్ డిజిటల్, తన కొత్త స్టోర్‌ను ప్రముఖ సినీహీరో, బాహుబలి నటదిగ్గజం రానా దగ్గుబాటి చేతుల మీదుగా పంజాగుట్ట, హైదరాబాదులో ప్రారంభించుకుంది. 
 
ఈ నూతన కేంద్రం ద్వారా హైదరాబాదులో రిలయన్స్ డిజిటల్ స్టోర్ల సంఖ్య 28కి చేరుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం కేంద్రాల సంఖ్య 57కు చేరింది. రిలయన్స్ డిజిటల్, భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం 800కు పైగా నగరాల్లో 300కు పైగా భారీ సముదాయాల రిలయన్స్ డిజిటల్ కేంద్రాలు మరియు 1700కు పైగా మై జియో స్టోర్లతో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. 
 
పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ సమీపంలో ప్రారంభించిన ఈ నూతన రిలయన్స్ డిజిటల్ కేంద్రంతో నూతన టెక్నాలజీ, వినియోగదారులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందుబాటు ధరల్లో ఉత్పత్తులను తీసుకువచ్చింది. రిలయన్స్ డిజిటల్ తన కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా 500 అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లతో కలిపి 2000కు పైగా ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తోంది. వినియోగదారుల కోరుకునే నూతన ఉత్పత్తులను ఎల్ఈడీ టీవీ, హైఎండ్ ఓఎల్ఈడీ టీవీ, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, హోంథియేటర్లు, డిజిటల్ కెమెరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, యాక్సెసరీలు వంటివి సంపూర్ణ రేంజ్‌లలో అందిస్తోంది.
 
రిలయన్స్ డిజిటల్ పంజాగుట్ట స్టోర్‌ను బాహుబలి సినిమా నటదిగ్గజం రానా దగ్గుబాటి ప్రారంభించారు. ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై సాటిలేని ఆఫర్లను అందించింది. అదృష్టవంతులైన కొంతమంది వినియోగదారులు కేవలం ఆకర్షణీయ ఆఫర్లను సొంతం చేసుకోవడమే కాకుండా రానా దగ్గుబాటిని వ్యక్తిగతంగా నేరుగా కలుసుకునే అవకాశం సొంతం చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ సీఈఓ, బ్రియాన్ బేడ్ మాట్లాడుతూ... హైదరాబాదులో మా సేవలు అందించే పరిధిని మరింత విస్తరించడం ద్వారా పెద్దఎత్తున వినియోగదారులకు సేవలు అందించనున్నాం. మా వినియోగదారులకు ప్రపంచ శ్రేణి షాపింగ్ అనుభూతులు మరియు అమ్మకం తర్వాతి సేవలు అందించడం లక్ష్యంగా మేం నిర్దేశించున్నాం. మా వినియోగదారులు పంజాగుట్ట, హైదరాబాదులోని నూతన కేంద్రంలో కొత్త షాపింగ్ అనుభూతిని సొంతం చేసుకుంటారని భావిస్తున్నాం అని తెలిపారు.
 
రిలయన్స్ డిజిటల్, తన నూతన కేంద్రాల ద్వారా అందుబాటు ధరల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉత్పత్తులను అందించడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా అందుబాటు ధరలు అనేది పెద్ద సమస్యనే కాదు. వివిధ బ్యాంకులు అందించే ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఇది మరింత సులభం అవుతుంది. రిలయన్స్ డిజిటల్ అందించే పేపర్ ఫైనాన్స్ ఆప్షన్ల ద్వారా ఏడాదిపాటు ఆయా సదుపాయలను పొందవచ్చు. తద్వారా డిజిటల్ ఇండియాకు సహకరించనున్నారు. కన్య్యూమర్ ఎలక్ట్రానిక్స్లో నూతన ఉత్పత్తులను తమ సొంతం చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోటారు బైకుపై మంత్రి నారా లోకేష్ పర్యటన... తుఫాన్ బాధిత ప్రాంతాల్లో...