Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహ కలెక్షన్ ఆవిష్కరణ: మాన్యావర్ సరికొత్త సౌత్ కలెక్షన్లో నటించిన రామ్ చరణ్, శోభిత దూళిపాళ్ల

Ram charan-Sobhita
, శుక్రవారం, 22 డిశెంబరు 2023 (22:26 IST)
వేదాంత్ ఫ్యాషన్ లిమిటెడ్ తన వెడ్డింగ్ కలెక్షన్‌లో భాగంగా అందరికి గౌరవానని తెచ్చిపెట్టే వేష్టి, పంచకచమ్‌‌లను పరిచయం చేసింది. బ్రాండ్ అంబాసిడర్‌ అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ద్వారా ఈ అనుబంధాన్ని దక్షిణ భారతదేశంలో ఆవిష్కరించింది. వివాహ వేడుకల్లో వరుడు ధరించే వస్త్రాలు, ప్రతీ పండుగ సందర్భంగా పురుషులు ధరించే సంప్రదాయ వస్త్రాల విభాగంగా అగ్రగామిగా ఉన్న సంస్థ మాన్యవర్. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన వేడుకలకు సంబంధించిన వస్త్రాలను ప్రపంచానికి అందించిన మాన్యావర్.. తాజాగా వివాహ కలెక్షన్లో భాగంగా పంచకచం, వేష్టికి సంబంధించిన వస్త్రాలను దక్షిణ భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మాన్యవర్ విభాగంలో ఇది ఒక అద్భుతమైన మైలురాయి. అంతేకాకుండా ఇది దక్షిణ భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని స్వీకరించడానికి మాన్యావర్ సదా సిద్ధంగా ఉందని చెప్పేందుకు కూడ నిదర్శనందా భావించవచ్చు.
 
ఈ అద్భుతమైన ప్రారంభానికి గుర్తుగా, మాన్యావర్ TaiyaarHokarAiye బ్యానర్‌పై ఒక ఆకర్షణీయమైన క్యాంపెయిన్ ఫిల్మ్ ను ఆవిష్కరించింది. ఈ ఫిల్మ్ లో బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ తన వివాహ వేడుక కోసం పంచకచం ధరించి కన్పిస్తారు. ఇందులో ఆయనకు జోడీగా శోభిత దూళిపాళ్ల నటంచింది.
 
క్యాంపెయిన్‌లో నటించిన రామ్ చరణ్ మరియు శోభిత జంట.. దక్షిణ భారతదేశం యొక్క వివాహ వేడుకల్ని, వివాహ వేడుకల యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పేదిగా ఉంది. అంతేకాకుండా వారసత్వం, ఆధునికతను సమపాళ్లలో జోడించండం ద్వారా మాన్యావర్ నిబద్ధతతో స్పష్టంగా కన్పిస్తుంది. ఇక ఇందులో  "తైయార్ హోకే ఆయే" అనే ట్యాగ్ లైన్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. వరుడి పాత్రలో కన్పించిన రామ్ చరణ్ తన సొంత వివాహానికి ఆలస్యంగా వస్తాడు. ఆ క్షణంలో వరుడి కోసం ఎదురుచూస్తున్న వధువు ముఖం చిన్నబోతుంది. దాన్ని అర్థం చేసుకున్న వరుడు... తన ఆలస్యానికి కారణం చెప్పి ఆమె మోముపై చిరునవ్వులు చిందేలా చేస్తాడు. ఆ క్షణంలో వధువు హృదయాన్ని గెల్చుకునేందుకు రామ్ చరణ్ చేసేది నిజంగా మీ హృదయాన్ని ద్రవింపజేస్తుంది.
 
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... " నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను... వివాహం సందర్భంగా మనం ఉపయోగించే ప్రతీ వస్తువు దక్షిణ భారత వారసత్వం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక వస్త్రాలు అయితే ప్రతీ పోగులో మన సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటిచెప్తాయి. నాకు మాన్యావర్‌పై చాలా అభిమానం ఉంది. అందుకే వారి క్యాంపెయిన్ లకు తరచుగా వస్తుంటాను. నేను వీటిగా ఆస్వాదిస్తున్నాను. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది మన ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలకు, దాని వెనుక ఉన్న కళాత్మకతకు మరియు దక్షిణ భారత వస్త్రధారణ యొక్క శాశ్వతమైన ఆకర్షణకు నివాళిగా ఉంటుంది అని అన్నారు ఆయన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశేషమైన వృద్ధి, భవిష్యత్తు ఆదాయ లక్ష్యాలను ప్రకటించిన ఎవల్యూటిజ్