Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో బ్లూ కాలర్ రిక్రూట్‌మెంట్‌పై సెమినార్‌ను నిర్వహించిన వాహన్ టెక్నాలజీస్

image

ఐవీఆర్

, శనివారం, 20 ఏప్రియల్ 2024 (22:20 IST)
ఖోస్లా వెంచర్స్, ఎయిర్‌టెల్ వంటి పెట్టుబడిదారుల మద్దతు కలిగి ఉండటంతో పాటుగా బ్లూ కాలర్ రిక్రూట్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న వాహన్ టెక్నాలజీస్, హైదరాబాద్‌లో బ్లూ కాలర్ రిక్రూట్‌మెంట్‌పై ఒక సెమినార్‌ను నిర్వహించింది. ఫుడ్ డెలివరీ, క్విక్ సర్వీస్, ఇ-కామర్స్, తయారీ వంటి పరిశ్రమల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా రిక్రూట్‌మెంట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా గుర్తింపు పొందిన బ్లూ-కాలర్, గిగ్ రిక్రూట్‌మెంట్‌పై వాహన్ దృష్టి సారించింది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం, 2030 నాటికి 2.35 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉంటారు, 2020- 2030 మధ్య కాలంలో 200% వృద్ధి చెందనున్నారు. 
 
సెమినార్‌ను ఉద్దేశించి, వాహన్ టెక్నాలజీస్ సంస్థ సప్లై అక్విజిషన్ హెడ్ సిద్ధార్థ్ చౌహాన్ మాట్లాడుతూ, దేశంలో గిగ్ వర్కింగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా రిక్రూట్‌మెంట్ పరిశ్రమ, ముఖ్యంగా బ్లూ-కాలర్ విభాగం వృద్ధి గురించి వివరాలను వెల్లడించారు. "బ్లూ-కాలర్ ఉపాధిలో సవాళ్లను పరిష్కరించడం, బ్లూ కాలర్ కార్మికులకు ఉపాధి కల్పించడంలో సహాయపడేటప్పుడు వ్యక్తులు మంచి నిష్క్రియాత్మక ఆదాయ వనరును పొందడంలో సహాయపడటంపై మా దృష్టి ఉంది” అని శ్రీ చౌహాన్ చెప్పారు.
 
వాహన్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ బ్లూ-కాలర్ రిక్రూట్‌మెంట్‌ను త్వరితగతిన ఎలా నిర్వహించిందో, రిక్రూటర్‌లకు మరింత లాభాలు, అర్హత ఉన్న అభ్యర్థులకు కొన్ని గంటల్లో ఉద్యోగాన్ని ఎలా అందించిందో ఆయన వివరించారు. ''బ్లూ కాలర్ వర్కర్లకు పెరుగుతున్న డిమాండ్‌తో, బ్లూ కాలర్ రిక్రూట్‌మెంట్‌ను కేవలం వ్యాపార అవకాశంగా మాత్రమే కాకుండా వ్యక్తులకు వారి ఆదాయాలను పెంచడానికి, వారి జీవనశైలిని మెరుగుపరచడంలో సహాయపడటానికి ఒక ఫ్రీలాన్సింగ్/అదనపు ఆదాయ వనరుగా మార్చడమే మా లక్ష్యం" అని వాహన్ టెక్నాలజీస్, ఛానల్ హెడ్, దివ్య గోయెల్ చెప్పారు.
 
జొమాటో, స్విగ్గి, బ్లింకిట్, అమెజాన్, ఉబెర్, మరెన్నో ప్రముఖ బ్రాండ్‌లతో సన్నిహితంగా పనిచేస్తున్న వాహన్ టెక్నాలజీస్, 2023లో 1.64 లక్షల మంది ఉద్యోగార్ధులకు జీవనోపాధిని కనుగొనడంలో కంపెనీ సహాయం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం