Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక వారం ఐస్‌క్రీం కోర్సుకు రూ.5.50 లక్షలట!!!

ఒక వారం ఐస్‌క్రీం కోర్సుకు రూ.5.50 లక్షలట!!!
, సోమవారం, 25 జూన్ 2012 (17:04 IST)
File
FILE
ఒక వారం కోర్సుకు రూ.5.50 లక్షలు, రెండు వారాల కోర్సుకు రూ.9.50 లక్షలు, ఒక నెల కోర్సుకు రూ.18 చొప్పున అక్కడ వసూలు చేస్తుంటారు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసే కోర్సు.. ఈ ఇంజనీరింగో.. ఏరోనాటికలో.. వైద్యవృత్తో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కేవలం ఐస్‌క్రీం కోర్సు. ఏంటీ.. ఐస్‌క్రీం కోర్సుకు ఇంత మొత్తంలో ఖర్చు చేయాలంటారా. అవునండీ.. ఆ ఐస్‌క్రీం యూనివర్శిటీలో కోర్సు పూర్తి చేయాలంటే ఆ మొత్తంలో వెచ్చించక తప్పదు మరి. ఇంతకీ అలాంటి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది.. దాని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా. అయితే, ఈ కథనం చదవాల్సిందే.

ఐస్‌క్రీం తయారీలో శిక్షణనిచ్చేందుకూ కార్పిగియానీ గెలాటో పేరుతో ఓ యూనివర్శిటీ ఉందండోయ్‌. సెంట్రల్‌ ఇటలీలోని బొలొగ్నా సమీపంలో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటారా? అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఐస్‌క్రీం తయారీలో శిక్షణ పొందుతున్నారు.

ఇక్కడ ఐస్‌‌క్రీం సెమినార్లు, కన్సల్టింగ్‌ బుక్స్‌, ఫ్లేవర్‌, ప్రొడక్ట్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌పై ఇందులో శిక్షణ ఇస్తారు. అంతేకాదండోయ్‌... అన్ని యూనివర్శిటీల్లోలాగే ఇక్కడ కూడా ప్రాక్టికల్‌, టెక్నికల్‌ కోర్సులతో పాటు ఐస్‌క్రీం తయారీలో సంప్రదాయ పద్ధతులు, మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో నిపుణులు తర్ఫీదునిస్తారు.

ఈ గెలాటో యూనివర్శిటీని ఇటలీలో 1995 సంవత్సరంలో మాల్కోల్మ్‌ స్టోగో అనే వ్యక్తి ప్రారంభించారు. ఈయన 25 ఏళ్ల నుంచి ఐస్‌క్రీం తయారీలో నిష్ణాతులు. ఐస్‌క్రీం తయారీపై పరిశోధనలు చేసి ఎన్నో పుస్తకాలు రాశారు. ఇటీవలే ఇన్‌క్రెడిబుల్‌ ఐస్‌క్రీం అన్న పుస్తకాన్ని రచించి మార్కెట్‌లోకి విడుదల చేశారు.

రస్ప్‌బెర్రీ, హసెల్‌నట్‌, లెమన్‌, ఫెన్నెల్‌, మోర్టాడెల్లా ఫ్లేవర్స్‌ ఇక్కడి స్పెషాలిటీ. ప్రస్తుతం ఈ వర్సిటీలో 12 వేల మంది శిక్షణ పొందుతున్నారు. చైనా, స్పెయిన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌లో ఈ వర్శిటీ శాఖలు ఉన్నాయి. ఇందులో 400 మంది ఉద్యోగులున్నారు. ఈ వర్శిటీలో చేరే విద్యార్థులకు కోర్సు పూర్తయ్యేంత వరకు ఉచిత గృహ వసతిని కల్పిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu